Advertisement
Google Ads BL

త్రివిక్రమ్‌ స్వయంకృతాపరాధం..!


వాస్తవానికి త్రివిక్రమ్‌కు దేవిశ్రీప్రసాద్‌కు మధ్య మంచి అండర్‌స్టాడింగ్‌ ఉంది. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ప్రతి సినిమా కూడా మ్యూజికల్‌ హిట్‌గా నిలిచింది. కానీ కొత్తదనం కోసమో.. లేక మరో కారణమో తెలియదు కానీ త్రివిక్రమ్‌ తాజాగా నితిన్‌ హీరోగా చేస్తున్న 'అ..ఆ' (అనసూయ రామలింగం వర్సెస్‌ ఆనంద్‌ విహారి) సినిమాకి మాత్రం సంగీత దర్శకునిగా తమిళ సంచలనం అనిరుద్‌ రవిచంద్రన్‌ను తీసుకున్నాడు. కానీ ఆయన ఇతర తమిళ చిత్రాలతో బిజీగా ఉండటం, బీప్‌ సాంగ్‌ వివాదంలో ఇరుక్కోవడం వంటి కారణాల వల్ల ఇప్పటికీ ఈ చిత్రానికి ట్యూన్స్‌ ఇవ్వలేకపోయాడు. వాస్తవానికి ఈ చిత్రం కోసం త్రివిక్రమ్‌ నిర్మాతతో కాస్త భారీ మొత్తానే అనిరుద్‌కు పారితోషికం ఇప్పించాడు. సినిమా షూటింగ్‌ దాదాపు 80శాతం వరకు పూర్తయినా, ఇంకా అనిరుద్‌ ట్యూన్స్‌ ఇవ్వకపోవడంతో ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయాలని భావించిన త్రివిక్రమ్‌ అనిరుద్‌ వల్ల మార్చి నాటికి కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయడం కష్టంగా మారింది. ఇప్పుడు ఏకంగా ఆయన ఈ ప్రాజెక్ట్‌ నుండి తప్పుకున్నాడు. అతని స్థానంలో దేవిశ్రీప్రసాద్‌ను గానీ లేదా మిక్కీజె మేయర్‌ను గానీ తీసుకోవాలని త్రివిక్రమ్‌ భావిస్తున్నాడు. దేవిశ్రీకి అనేక కమిట్‌మెంట్స్‌ ఉన్న నేపథ్యంలో ఆయన ఈ చిత్రాన్ని ఒప్పుకోకపోవచ్చు. అందులో తనని కాదని అనిరుధ్‌ను తీసుకోవడం కూడా దేవిశ్రీని బాగా హర్ట్‌ చేసిందని సమాచారం. దీంతో మిక్కీజె మేయర్‌తోనే ముందుకు సాగాలని త్రివిక్రమ్‌ ప్లాన్‌ చేస్తున్నాడట. కాగా గతంలో కూడా రామ్‌చరణ్‌ హీరోగా శ్రీనువైట్ల దర్వకత్వంలో వచ్చిన 'బ్రూస్‌లీ' చిత్రానికి కూడా మొదట అనిరుద్‌నే మ్యూజిక్‌ డైరెక్టర్‌గా తీసుకోవాలని భావించారు. కానీ ఆయన అనుకున్న విధంగా తమకు అందుబాటులో ఉండని కారణంగా చివరి క్షణాల్లో ఆయన బదులు తమన్‌ను సంగీత దర్శకునిగా తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రంలో సమంతతో పాటు అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్లుగా నటిస్తుండగా, కీలకపాత్రలో నదియా నటిస్తోంది. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs