ఎన్టీఆర్ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారింది. ఆయనకు 'బాద్‌షా, టెంపర్'లతోపాటు తాజాగా 'నాన్నకు ప్రేమతో' చిత్రాల రూపంలో మంచి హిట్స్ వచ్చాయని అందరూ భావిస్తున్నా.. ఈ చిత్రాలు ఓవర్ బడ్జెట్ కారణంగా కాస్ట్‌ఫెయిల్యూర్‌గా నిలుస్తున్నాయి. మరోవైపు రామ్‌చరణ్ పరిస్థితి కూడా అలాగే ఉంది. కాగా త్వరలో ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్‌లో 'శ్రీమంతుడు' చిత్రాన్ని నిర్మించిన మైత్రి మూవీస్ అధినేతలు తాజాగా నిర్మిస్తున్న 'జనతాగ్యారేజ్' చిత్రాన్ని కేవలం నాలుగు నెలల్లో పూర్తి చేయాలని ప్లాన్ చేసుకున్నారట. అంతేకాకుండా ఈ చిత్రం కాస్ట్‌ఫెయిల్యూర్ కాకుండా ఉండే ఉద్ధేశ్యంతో ఈ చిత్రాన్ని కేవలం 40కోట్ల బడ్జెట్‌లోపే తీయాలని కొరటాల శివకు, ఎన్టీఆర్‌కు వెల్లడించారని సమాచారం. కాగా రామ్‌చరణ్ విషయానికి వస్తే ఆయన చేయబోయే కొత్త చిత్రం తమిళ 'తని ఒరువన్' కావడంతో ఈ చిత్రాన్ని కూడా కేవలం నాలుగు నెలల్లోనే పూర్తి చేయాలని అల్లుఅరవింద్ ఆలోచిస్తున్నాడు. అందునా ఈ చిత్రం ఓ రీమేక్ కావడంతో బడ్జెట్ 25 నుండి 30కోట్ల లోపలే పూర్తి చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. కాగా ఈ రెండు చిత్రాలు ఫిబ్రవరి రెండో వారంలో సెట్స్‌పైకి వెళ్లనున్నారు. ఈ రెండు చిత్రాలు ఆగష్టు 12నే విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో నిర్మాతలు ముందస్తు ప్రణాళికలతో ఉన్నారని తెలుస్తోంది.