14 రీల్స్ సంస్థ, మహేష్ బాబుల మధ్య అప్పట్లో మూడు సినిమాల పెద్ద డీల్ జరిగిందన్న విషయం మనకు తెలిసిందే. దూకుడు మినహాయించి ఆగడు అండ్ నేనొక్కడినేలు ఈ అగ్రిమెంట్ వల్ల భారీగా నష్టపోయిన సినిమాలుగా మిగిలాయి. నిర్మాతలు గోపీచంద్, రామ్, అనిల్ ముగ్గురూ ఎంత పోగొట్టుకున్నారో, ఎంత మూట గట్టుకున్నారో కరెక్టుగా ఎవరికీ తెలియదు బట్ మరోసారి ఇంకో మూడు సినిమాల డీల్ కోసం 14 రీల్స్ వాళ్ళు మహేష్ బాబుతో స్కెచ్ వేస్తున్నారట. అప్పట్లో అయితే శ్రీను వైట్లకు 14 రీల్స్ వారితో ఉన్న సాన్నిహిత్యం మీద మహేష్ బాబును ఒప్పించడంలో రాయబారం నడిపారు. మరి ఈసారి అలాంటి త్రీ మూవీ కాంబినేషన్ సెట్ కావాలంటే ఎవరో ఒకరు పెద్ద దర్శకుడే ముందుకు రావాలి. మొదటిసారి గట్టి దెబ్బలు తగిలాయి కాబట్టి ఇరు వర్గాలు కథలు, కథనాలు, దర్శకులు సిద్ధంగా ఉంటె తప్ప ముందు రారు. ఒక చిన్న ప్రాజెక్టు పట్టాలెక్కాలంటేనే ఎన్నో విషయాలు కుదరాలి. అలాంటిది ఇంత భారీ కలయికలు అంత వీజీగా సెట్ కావు. అయినా కృష్ణగాడి వీరప్రేమగాధ తరువాత ఈ తతంగం పట్ల మరింత స్పష్టత దొరికే ఆస్కారం ఉంది.