Advertisement
Google Ads BL

రూపాయికి రూపాయి లాభం...!


గతేడాది వచ్చిన 'భలేభలే మగాడివోయ్‌' చిత్రం బయ్యర్లకు, నిర్మాలకు రూపాయికి నాలుగు రూపాయల లాభాన్ని తీసుకొచ్చింది. అదే విధంగా 2016లో కూడా చిన్న సినిమాలకు శుభశకునంలా 'ఎక్స్‌ప్రెస్‌రాజా' దూసుకుపోతోంది. ఈ సంక్రాంతి సీజన్‌లో పెద్ద పెద్ద సినిమాలతో పోటీపడి విడుదలైన శర్వానంద్‌, మేర్లపాకగాంధీల కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ దగ్గర బాగానే నిలిచింది. ఈ చిత్రం బడ్జెట్‌ ఏడుకోట్లని చిత్ర యూనిట్‌ చెబుతున్నప్పటికీ అది నిజం కాదని, కేవలం 5కోట్లలోపే ఈ చిత్రం బడ్జెట్‌ ఉండి ఉంటుందని ట్రేడ్‌వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఆ లెక్కన తొలి రెండు రోజుల్లోనే ఈ సినిమా 5కోట్లు పిండేసింది. ఆ తర్వాత వచ్చినదంతా లాభమే. సంక్రాంతి సీజన్‌ ముగిసే సరికి ఈ చిత్రం రూపాయికి రూపాయి లాభం తెచ్చుకుందని సమాచారం. దాంతో హీరో శర్వానంద్‌ ఫుల్‌హ్యాపీగా ఉంటే... దర్శకుడు మేర్లపాక గాంధీకి నిర్మాతల, హీరోల తాకిడి ఎక్కువైంది. ఓ హిట్టు పడితే అంతే మరి అంటున్నాయి ఫిల్మ్‌నగర్‌ వర్గాలు...! 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs