Advertisement
Google Ads BL

బన్నీ ముహూర్తం ఫిక్స్ చేశాడు..!


ప్రస్తుతం అల్లుఅర్జున్‌ బోయపాటిశ్రీను దర్శకత్వంలో గీతాఆర్ట్స్‌ పతాకంపై అల్లుఅరవింద్‌ నిర్మాతగా ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. రకుల్‌ప్రీత్‌సింగ్‌, కేథరిన్‌లు హీరోయిన్లుగా రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రీకాంత్‌, ఆది పినిశెట్టి కూడా కీలకమైన పాత్రలు చేస్తున్నారు. కాగా యాక్షన్‌ ఓరియంటెండ్‌ లవ్‌స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రం టైటిల్‌ను 'సరైనోడు' అని ప్రచారం జరుగుతోంది. సో... టైటిల్‌ను కన్‌ఫర్మ్‌ చేస్తూ ఈ చిత్రంలోని అల్లుఅర్జున్‌ గెటప్‌తో ఫస్ట్‌లుక్‌ను సంక్రాంతికి విడుదల చేయాలని భావించారు. కానీ సంక్రాంతికి కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయలేదు. దాంతో బన్నీ అభిమానులు బాగా డిజప్పాయింట్‌ అయ్యారు. దాంతో బన్నీ ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను రిపబ్లిక్‌డే కానుకగా జనవరి 26న విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs