ప్రభాస్ పేరు ఎత్తితేనే ముందుగా బాహుబలి అటు తరువాత ఆయన పెళ్లి గూర్చి చర్చ మొదలవుద్ది. ఎందుకంటే మన బాహుబలికి పెళ్లి వయసు ముదిరిపోయి చాలా కాలం అవుతోంది. ప్రభాస్ రాజు గారి వివాహం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే అభిమానులందరికీ పెదనాన్న కృష్ణంరాజుగారు తీపి కబురు మోసుకొచ్చారు. మొన్న సంక్రాంతికి ప్రభాస్ తనను కలిశాడని, పెళ్లి విషయం చర్చకు వచ్చిందని చెప్పుకొచ్చారు. ఈ ఏడాది ఎలాగయినా ఓ ఇంటివాడిని అవుతానని ప్రభాస్ తనకు ప్రామిస్ చేసారని కూడా అన్నారు. ఇంత జరిగినా మరి అమ్మాయిని వెతికి తెచ్చే బాధ్యత కృష్ణంరాజు గారికి అప్పగించారా అంటే మాత్రం సరైన సమాధానం మా దగ్గర కూడా లేదు. ఎందుకంటే స్వయానా రాజుగారికే మన ప్రభాస్ ప్రేమ వివాహం చేసుకుంటాడా లేక పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటాడా అన్న విషయంలో సందిగ్ధత ఉంది. చాయిస్ వాడికే ఇచ్చేసా అంటూ కృష్ణంరాజుగారు ముసిముసిగా నవ్వారంటే ప్రభాస్ మదిలో ఎవరో అమ్మాయి ఉందనేగా అర్థం. సినిమాలు, పెళ్ళేమోగానీ ఆ ప్రభాస్ మనసులోని అమ్మాయెవరో మాకు చూడాలనే ఉంది రాజు గారూ!!!