బాలకృష్ణకు ఒకటి కాదు రెండు సరైన మేటి హిట్ సినిమాలు సింహా, లెజెండ్ ఇచ్చాడు గనక నటసింహం 100వ సినిమాకు దర్శకత్వం వహించే అర్హత అందరికన్నా ఎక్కువగా బోయపాటి శ్రీనుకే ఉందన్న విషయాన్ని మనం ఒప్పుకోవాల్సిందే. మొన్నటి వరకు కూడా బోయపాటి వైపే మొగ్గు చూపిన బాలయ్య సెంచరీ సినిమా ఇప్పుడు ఉన్న పళంగా సింగీతం శ్రీనివాస రావు గారి చేతుల్లోకి వెళ్ళడం అదీ ఆదిత్య 369 సీక్వెల్ అంటూ ఆదిత్య 999 అవడం అందరికే ఆశ్చర్యంగానే ఉంది. కానీ తెరవెనక కథనం ప్రకారం బోయపాటిని బాలయ్య కావాలనే తప్పించారట. తన 100వ సినిమాకు బదులుగా సుపుత్రుడు మోక్షజ్ఞ్య ఆరంగేట్ర సినిమాకు దర్శకత్వ బాధ్యతను మోయమని బోయపాటికి బాలయ్య సెలవిచ్చారట. అంటే తమను నమ్ముకున్నవారికి ఒకటి పోయినా మరొకటి ఇచ్చి తృప్తిపరిచే గుణం నందమూరి వారిలో మెండు. ఆదిత్య 999లో క్యామియో పాత్రతో మోక్షజ్ఞ్య తెర పరిచయం జరగనున్నా, బోయపాటి సినిమాలో చేసే సిసలైన యాక్షనుతోనే బుల్లి నటసింహం అసలు ఇన్నింగ్స్ ఆరంభం కానుంది.