స్టార్‌హీరోలతో చేస్తే కెరీర్ గ్రాఫ్ టక్కున మారిపోతుంది. రెమ్యూనరేషన్ కూడా అమాంతం రెట్టింపు అయిపోతుంది. ఇప్పుడు రకుల్‌ప్రీత్‌సింగ్‌కు అదే జరుగుతోంది. ఆమెకు ఎక్కడలేని డిమాండ్ వచ్చేసింది. అందరు హీరోలు ఆమెనే కోరుకుంటున్నారు. అయితే ఆమె బేనర్, డైరెక్టర్, హీరో వంటివాటినే కాక రెమ్యూనరేషన్ కూడా భారీగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. రీసెంట్‌గా ఆమె బెల్లంకొండ సాయిశ్రీనివాస్ - బోయపాటి శ్రీనుల కాంబినేషన్‌లో రూపొందే చిత్రంలో నటించేందుకు అంగీకారం తెలిపినట్లు సమాచారం. బెల్లంకొండ వంటి అప్ కమింగ్ హీరోతో సినిమా చేస్తుండటంతో దానికి తగ్గ ఫీజు కూడా ఆమె వసూలు చేసింది. ఆమె తన రెమ్యూనరేషన్‌ను కోటిన్నరకు పెంచి మరీ వసూలు చేస్తోంది. బోయపాటి శ్రీనునే దగ్గరుండి మరీ ఈ ప్రాజెక్ట్‌ని ఆమెకు సెట్ చేసినట్లు సమాచారం. ఇప్పుడు ఆమెతోనే బోయపాటిశ్రీను అల్లుఅర్జున్ హీరోగా చేస్తున్న 'సరైనోడు' చిత్రంలో బన్నీ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. మొత్తానికి 'నాన్నకు ప్రేమతో' చిత్రంతో తనకు వచ్చిన క్రేజ్‌ను ఆమె బాగా క్యాష్ చేసుకుంటోందని అంటున్నారు.