Advertisement
Google Ads BL

చిరంజీవి గారు కత్తి, మీసం మెలేసారు!


చిరంజీవి గారి 150వ సినిమాగా తమిళ హిట్ కత్తి తెలుగు రీమేక్ తొందరలోనే సెట్స్ మీదకి వెళ్లనుంది. దర్శకుడు వీవీ వినాయక్ గారు, నిర్మాత రామ్ చరణ్ గారు అన్నింటా ఈ చిత్రం నెంబర్ 1గా ఉండాలన్న తపనతో పని చేస్తున్నారు. కమర్షియల్ విలువలతో పాటుగా మంచి సందేశం ఉంది కాబట్టే ఈ స్క్రిప్టుని మెగా స్టార్ ఒప్పుకున్నారని ముందే చెప్పుకున్నాం. ఒప్పుకోవడమే కాకుండా తన వంతుగా క్యారెక్టర్ పండడం కోసం రకరకాల గెటప్పులు కూడా ట్రై చేస్తున్నారు. రెండు రోజుల క్రితం చిరంజీవి గారు హాజరయిన ఓ ముఖ్యమైన ఫంక్షన్లో ఇదిగో ఇలా మీసం మెలేసి కనిపించారు. సాధారణంగా ఈయన గారు ఎప్పుడో ఇంద్ర, స్నేహం కోసం సమయంలో ఒక్కసారో, రెండు సార్లో తప్ప పెద్దగా మీసం పెంచి, దాన్ని మెలేయడం చూడలేదు. కాబట్టి ఈ అవతారం కత్తి కోసమే అని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. కత్తి కథలో హీరో డ్యుయల్ రోల్స్ చేయాల్సి ఉంటుంది. అందులో ఒకటి కమ్యూనిస్ట్ భావజాలంతో ప్రజలకు మంచి చేయాలనుకునే క్యారెక్టర్. ఇక చిరు మీసం వెనక కథ ఈ పాత్ర కోసమేనని గట్టిగా అనేసుకోవచ్చు.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs