Advertisement
Google Ads BL

సప్తగిరి ఏంటి ఈ ట్విస్ట్‌..?


కమెడియన్‌ సప్తగిరి హీరోగా సీనియర్‌ దర్శకుడు సాగర్‌ దర్శకత్వంలో ఆయన శిష్యుడు రవికుమార్‌చౌదరి ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాడనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. రుగ్వేద డ్రీమ్స్‌ పతాకంపై రూపొందే ఈ చిత్రం షూటింగ్‌ ఫిబ్రవరి నుండి ప్రారంభం కానుందని అన్నారు. అయితే ఇప్పుడు అలాంటిదేం లేదని కమెడియన్‌ సప్తగిరి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ పెట్టాడు. ఆయన... ఆ వార్తల్లో నిజం లేదని, హాస్యనటుడిగా ఇలాగే తనకు ఎంతో బాగుందని, ఎప్పటిలాగే తాను కమెడియన్‌గా కంటిన్యూ అవుతానని, ఎప్పటిలాగే తనకు సపోర్ట్‌ ఇవ్వమని సప్తగిరి తన ఫేస్‌బుక్‌ ఖాతాలో వెల్లడించాడు. కానీ రవికుమార్‌ చౌదరి మాత్రం ఈ చిత్రంలో సప్తగిరి హీరోగా నటిస్తున్నాడని చెప్పుకొచ్చాడు. ఇదంతా వింటున్నవారు ఏమిటి సప్తగిరి? ఈ ట్విస్ట్‌లు ఏంటి? ఈ పంచ్‌లు ఏంటి? అంటున్నారు. ప్రేక్షకులను తన నటన, పంచ్‌ డైలాగులతో నవ్వించే నటుడు సప్తగిరి. రీసెంట్‌గా వచ్చిన 'ఎక్స్‌ప్రెస్‌రాజా' లో కూడా ఓ కీలకమైన పాత్రను పోషించాడు. ఆ పాత్ర సినిమా మొత్తం సాగి నవ్వించింది. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs