సంక్రాంతి సినియుద్ధంలో తారాగణం విషయంలో ఏమంత ఘనం లేకుండా నిలబడిన సినిమా ఎక్స్ ప్రెస్ రాజా. హీరోగా శర్వానంద్ రన్ రాజా రన్ అంటూ హిట్టు కొట్టినా, వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రంతో దర్శకుడిగా మారిన మేర్లపాక గాంధీ ఈ మూవీకి పనిచేసినా కేవలం UV క్రియేషన్స్ బ్యానర్ యొక్క వ్యాల్యూని మాత్రమే నమ్ముకొని థియేటర్స్ లోకి దిగింది ఈ ఎక్స్ ప్రెస్ రాజా. మొదటి రోజు నామమాత్రంగానే ప్రేక్షకుల నుండి స్పందన వచ్చినప్పటికీ హాస్యానికి పెద్దపీట వేసే తెలుగు సినిమోద్దారకుల దీవెనలతో క్రమేపీ ఎక్స్ ప్రెస్ రాజా వేగం పుంజుకుంటోంది. లాజిక్కులు పక్కనెట్టి ప్రతి సీన్లోనూ సరదాగా నవ్వుకోవాలంటే ఈ సినిమాకు వెల్లండనే మౌత్ పబ్లిసిటీ కూడా ఉచితంగా లభించడం శర్వానంద్ ఫిలింకి బాగా ప్లస్ అవుతోంది. ముఖ్యంగా మల్టిప్లెక్సులలో ఇటువంటి వాటికి ఆదరణ ఎక్కువ. మరి నిర్మాతలు టార్గెట్ చేసింది కూడా అదే సెక్షన్ ఆడియెన్సు కావడంతో రానున్న రెండు రోజులలో సిటీస్ అంతటా ఎక్స్ ప్రెస్ రాజా ఫీవర్ కొంత ఎక్కువయ్యే సూచనలు కూడా ఉన్నాయి. సో, మన ఎక్స్ ప్రెసుకి పచ్చ జెండా ఊపింది ఇప్పుడే...