స్టార్‌హీరోయిన్‌ ని లైంగికంగా వేధించారంట!


బాలీవుడ్‌ సెన్సేషన్‌ కంగనారౌనత్‌ కెరీర్‌ మొదట్లో ఎన్ని ఇబ్బందులు పడిందో ఇటీవల ఓ సందర్బంగా చెప్పుకొచ్చింది. సెక్స్‌వల్‌గా వేధింపులు ఎదుర్కొన్నానని, దాడి కూడా జరిగిందని ఆమె చెప్పుకొచ్చింది. నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో నాకు 17ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఓ సెలబ్రిటీ నన్ను సెక్స్‌వల్‌గా వేధించాడు. నా తలపై దాడి చేయడంతో రక్తస్రావం జరిగింది. ఆ సెలబ్రిటీకి నా తండ్రి వయసు ఉంటుంది. ఈ విషయమై అప్పట్లో నేను పోలీసులకు ఫిర్యాదు చేసినా.. అతనికి సమాజంలో బాగా పలుకుబడి ఉండటంతో కేవలం వార్నింగ్‌ ఇచ్చి వదిలిపెట్టారు.. అని కంగనా తెలిపింది. అయితే ఆ సెలబ్రిటీ ఎవరు? అనే విషయం మాత్రం కంగనా బయటపెట్టలేదు. ఎవరి అండలేకుండా సినిమా రంగంలో ఎదిగిన హీరోయిన్లలో కంగనారౌనత్‌ ఒకరు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తొలి సంవత్సరాలలో ఆమె దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొంది. అయితే క్రమక్రమంగా మంచి అవకాశాలు రావడం, హిట్స్‌ తన ఖాతాలో పడటంతో ఆమె స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. 

Show comments


LATEST TELUGU NEWS


LATEST IN NEWS

POPULAR NEWS



LATEST IN GALLERIES

POPULAR GALLERIES