కమెడియన్‌గా కాస్త పేరు వస్తే చాలు..అతనికున్న క్రేజ్‌ని వాడేసుకోవడానికి మన నిర్మాతలు తెగ తాపత్రయపడిపోతున్నారు. ఇంకా కమెడియన్‌గానే ఉంటావా..హీరోగా చేస్తావా..అంటూ ఆపర్లు ఇచ్చేసి..వారి క్రేజ్‌ని క్యాష్ చేసుకునే ప్రయత్నాలు ఎలా జరుగుతాయో..గతంలో బ్రహ్మానందం, ఆలీ, వేణుమాధవ్..ఆ తర్వాత సునీల్‌ల విషయంలో చూస్తూనే ఉన్నాం. తాజాగా టాలీవుడ్‌లో టాప్ కమెడియన్‌గా పేరు పొందిన, పొందుతున్న సప్తగిరిని కూడా కామెడీకి దూరం చేసే ప్రయత్నాలు మొదలయ్యాయ్. ఆ ప్రయత్నం చేస్తుంది మరెవరో కాదు..సీనియర్ దర్శకుడు సాగర్. అవును సాగర్ దర్శకత్వంలో సప్తగిరి హీరోగా ఓ మూవీ అతి త్వరలో ప్రారంభం కాబోతుంది. మరో విశేషం ఏమిటంటే..ఈ మూవీకి నిర్మాత 'పిల్లా నువ్వులేని జీవితం' దర్శకుడు ఏయస్ రవికుమార్ చౌదరి. సాగర్ శిష్యులైన వినాయక్, శ్రీనువైట్ల, రవికుమార్ చౌదరి, నాగేశ్వరరెడ్డిలు ఈ మూవీ రూపకల్పనకు వెన్నుదన్నుగా నిలుస్తారంట. ఈ వార్త విన్నవారంతా..ఇప్పటికే సునీల్ అష్టకష్టాలు పడుతున్నాడు. ఈ లిస్ట్‌లోకి సప్తగిరిని కూడా చేర్చబోతున్నారన్నమాట అని అనుకుంటుండటం విశేషం.