Advertisement
Google Ads BL

'జనతాగ్యారేజ్‌' కి ప్రణాళిక సిద్ధం!


సంక్రాంతి బరిలోకి 'నాన్నకు ప్రేమతో' చిత్రంతో దిగిన ఎన్టీఆర్‌ తనకు ఇంతకాలం అందని ద్రాక్షగా మిగిలిన 50కోట్ల క్లబ్‌లో చేరడానికి ఉవ్విళ్లూరుతున్నాడు. ఈ చిత్రానికి క్లాస్‌ ఆడియన్స్‌ నుండి మంచి రెస్పాన్స్‌ లభిస్తోంది. కాగా ఎన్టీఆర్‌ తన తదుపరి చిత్రం 'జనతాగ్యారేజ్‌' (వర్కింగ్‌ టైటిల్‌)కు రెడీ అవుతున్నాడు. కొరటాల శివ దర్శత్వంలో 'శ్రీమంతుడు' చిత్రాన్ని నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని కూడా నిర్మించనుంది. ఈ చిత్రం పూజాకార్యక్రమాలు ఎప్పుడో లాంఛనంగా ప్రారంభం కూడా అయిపోయాయి. కాగా ఫిబ్రవరి 10వ తేదీ నుండి ఈ చిత్రం షూటింగ్‌ మొదలుకానుందని సమాచారం. ఎన్టీఆర్‌ కొద్దిరోజుల గ్యాప్‌ తర్వాత అంటే ఫిబ్రవరి 17 నుండి ఈ చిత్రం సెట్స్‌లోకి ఎంటర్‌ కాబోతున్నాడు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ చిత్రాన్ని ఎలాగైనా అనుకున్న ప్రణాళిక ప్రకారం షూటింగ్‌ పూర్తి చేసి ఆగష్టు 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనేది దర్శకనిర్మాతల ప్లాన్‌. ఇందుకోసం వారు పక్కా ప్రణాళిక సిద్దం చేసుకుంటున్నారు. కాగా ఈ చిత్రంలో మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ ఓ కీలకమైన పాత్రను చేయనుండగా, సమంత, నిత్యామీనన్‌లు ఎన్టీఆర్‌ సరసన హీరోయిన్లుగా నటిస్తారని సమాచారం. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs