Advertisement
Google Ads BL

రామ్‌చరణ్‌ ది ఎన్టీఆర్‌ వాడేశాడు!


రీమేక్‌లతో ఓ చిక్కుంది. వాటి వేడి చల్లారకముందే రీమేక్‌ తీసేయాలి. లేదంటే ఆ ఐడియాలను తెలివిగా ట్రాకుల రూపంలో ఇతరులు ఎత్తేసే ప్రమాదం ఉంది. ఇప్పుడు రామ్‌చరణ్‌ సినిమాకి కూడా ఇదే ప్రమాదం వచ్చిపడింది. అదీ ఎన్టీఆర్‌ రూపంలో. తాజాగా ఎన్టీఆర్‌-సుకుమార్‌ల కాంబినేషన్‌లో 'నాన్నకు ప్రేమతో' చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ సినిమాలో 'మైక్రోచిప్‌' ఎపిసోడ్‌ ఉంది. హీరో ప్లాన్స్‌ను విలన్‌ ముందుగానే తెలుసుకునే విధంగా ఆఫీస్‌లో 'మైక్రోచిప్‌' పెడతారు. చివరలో దాని కథ రివీల్‌ అవుతుంది. సినిమాలో ఈ ఎపిసోడ్‌ చాలా ఇంట్రస్టింగ్‌ ఎలిమెంట్‌. ఈ ఎపిసోడ్‌ చూస్తే తమిళ సూపర్‌హిట్‌ మూవీ 'తని ఒరువన్‌' గుర్తుకురాకమానదు. సుకుమార్‌ కాపీ చేశాడో? ముందే అనుకున్నాడో? స్ఫూర్తి పొందాడో? ఏదైనా కానివ్వండి. 'వాడకం' మాత్రం జరిగిపోయింది. ఇప్పుడు 'తని ఒరువన్‌'ను సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్‌ రీమేక్‌ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో 'మైక్రోచిప్‌' ఎపిసోడ్‌ చాలా కీలకం. ఇప్పుడా ఎపిసోడ్‌ 'నాన్నకు ప్రేమతో'లో వచ్చేసింది. దాన్నే మరలా చరణ్‌ చూపిస్తే ఎన్టీఆర్‌ సినిమాని కాపీ కొట్టేశాడు అని సాధారణ ప్రేక్షకులు అభిప్రాయపడే ప్రమాదం కూడా ఉంది. మరి, ఈ విషయంలో చరణ్‌, సురేందర్‌రెడ్డిలు ఎలాంటి మార్పులు చేసుకుంటారో వేచిచూడాలి...! 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs