Advertisement
Google Ads BL

బాలీవుడ్ 'కత్తి' కథ ఇది!


తమిళ స్టార్‌ విజయ్‌, దర్శకుడు మురుగదాస్‌ కాంబినేషన్‌లో తమిళంలో వచ్చిన 'కత్తి' చిత్రం కోలీవుడ్‌లో సూపర్‌హిట్టుగా నిలిచింది. దీంతో వివిధ బాషల్లో ఈ చిత్రం రీమేక్‌కు భారీ డిమాండ్‌ ఏర్పడింది. తెలుగులో ఈ చిత్రాన్ని మెగాస్టార్‌ చిరంజీవి, వినాయక్‌ దర్శకత్వంలో తన 150వ చిత్రంగా తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం హిందీ వెర్షన్‌ విషయంలో కూడా క్లారిటీ వచ్చింది. హీరో అక్షయ్‌కుమార్‌ ఈ రీమేక్‌లో నటించనున్నాడు. మొదట ఈ చిత్రాన్ని సల్మాన్‌ఖాన్‌ హీరోగా తెరకెక్కించాలని మురుగదాస్‌ ఆశపడ్డాడు. ఈ విషయమై రెండు సార్లు సల్మాన్‌ఖాన్‌తో ఆయన చర్చలు కూడా జరిపాడు. అయితే మద్యలో ఏమైందో కానీ.. ఈ సినిమా ఇప్పుడు అక్షయ్‌కుమార్‌ చేతికి వెళ్లింది. 'ఎయిర్‌లిఫ్ట్‌' చిత్రం ప్రెస్‌మీట్‌లో 'కత్తి' రీమేక్‌ను దృవీకరించాడు అక్షయ్‌కుమార్‌. మరి ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో కూడా తమిళంలో సాధించినట్లుగానే ఘనవిజయం సాధిస్తుందో లేదో చూడాలి! 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs