Advertisement
Google Ads BL

తారక్ ప్రేమ.. తుఫాన్ లాంటిది: సుక్కు


నాన్నకు ప్రేమతో.. సినిమాలో తారక్ ను తప్ప ఇంకేవరినీ ఉహించుకోలేను - సుకుమార్

Advertisement
CJ Advs

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మించిన 'నాన్నకు ప్రేమతో' చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సంక్రాంతి కానుకగా జనవరి 13న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ అవుతుంది.  ఈ సందర్భంగా దర్శకుడు సుకుమార్ తో స్పెషల్ ఇంటర్వ్యూ...

ఇప్పటి వరకు చాలా సినిమాలు నాన్న సెంటిమెంట్ తో వచ్చాయి. మరి మీరెలా డిఫరెంట్ గా చూపిస్తున్నారు?

-చాలా మంది చాలా రకాలైన సినిమాలు తీసుండవచ్చు. సాధారణంగా ఫాదర్ పై సెంటిమెంట్ అనగానే చాలా మంది చాలా  రకాలు వ్యక్తం చేస్తుంటారు. ఆ ఎమోషన్ ను ఎన్ని రకాలుగా ఎక్స్ ప్రెస్ చేసినా తరగదు. అలాంటి ఎమోషన్ ను నా స్టయిల్ లో చూపిస్తున్నాను. తల్లిదండ్రులకు సంబంధించిన ఎమోషన్ యూనివర్సల్. అది మన వరకు వస్తే కానీ అర్థం కాదు. ఒకసారి నా తండ్రి చనిపోయిన తర్వాత ఆ ఎమోషన్ నాకు బాగా తెలిసింది. నేను అలాంటి మానసిక స్థితిలో ఉన్నప్పుడే ఈ కథను రాశాను.

ఈ సినిమాను ఎన్టీఆర్ వినగానే ఎమన్నారు?

-మనుషులను ప్రేమిస్తే వారిలోని లోపాలను కూడా ప్రేమించాలి. మనం ఒక వ్యక్తిని ప్రేమించినప్పుడు అతనిలో ఎమోషన్స్ కూడా స్వార్ధం, కోపం, అసూయను కూడా ప్రేమిస్తాం. తారక్ ఫేస్ లో ఎప్పుడూ ఏదో ఒక ఎమోషన్ కనపడుతుంది. తన  నవ్వుతున్నా ఓ ఎమోషన్ కనపడుతుంది. నేను ముందు ఓ కథ అనుకోగానే దానితో సినిమా చేసేయాలనుకున్నాను. అయితే మధ్యలో మా నాన్నగారు చనిపోయారు. నేను ఎమోషనల్ అయ్యాను. అలాంటప్పుడు నేను వేరే ఎమోషనల్ మూవీ చేయలేనేమో అని భావించాను. ఈ కథ అయితే సరిపోతుందనిపించింది. కథ వినగానే దాని కంటే ఈ కథ ఎన్టీఆర్ కు బాగా నచ్చింది. ఇలాంటి సినిమాను అందరికీ కనెక్ట్ అయ్యేలా చెప్పాలంటే కమర్షియల్ గా చెప్పాలి. అప్పుడే అందరికీ కనెక్ట్ అవుతుంది.

ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్ లో చూపించారు కదా, ఆలోచన ఎవరిది?

-కొన్సిసార్లు క్రెడిట్ నాకు వచ్చేస్తుంది కానీ నిజం చెప్పాలంటే ఆ ఐడియా నాది కాదు, ఎన్టీఆర్ దే. మా ఇద్దరి లుక్స్ ఒకేలా ఉన్నాయన్నారు కానీ నేను తారక్ ను ఫాలో అయ్యాను. తను ఈ లుక్ గురించి చెప్పగానే తను నేను సపోర్ట్ చేశానంతే. ఈ గెటప్ అనేది సినిమాను డ్రైవ్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది.

జగపతిబాబును విలన్ అనుకునే తన క్యారెక్టర్ ను డిజైన్ చేశారా?

-లేదండీ..ముందు  కథ మాత్రమే రాసుకున్నాను. తర్వాత ఆ క్యారెక్టర్ ఎవరు చేస్తే బావుంటుందని అనుకుని ఆలోచించి చివరకు జగపతిబాబుగారైతే ఓకే అనుకున్నాం.

ఎన్టీఆర్ పెర్ ఫార్మెన్స్ గురించి ..?

-ఈ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ పేరు అభిరామ్. ఎవరైనా ఒక విషయంలో మూడు పద్ధతులు ఫాలో అవుతారు. ఒకటి విషయం తెలుసుకోవడం, నేర్చుకోవడం, దాన్ని ఇంప్లిమెంట్  చేయడం. కానీ తారక్ విషయంలో రెండు స్టేజ్ లే కనపడతాయి. విషయం తెలుసుకోవడం, ఇంప్లిమెంట్ చేయడం. ఇలా చేయడం వల్ల తనకు చాలా టైమ్ కలిసి వస్తుందని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే నేర్చుకోవడమనే ప్రాసెస్ ఉండకపోవడం తనకు బాగా కలిసి వస్తుంది. తను నందమూరి వంశంలో పుట్టడం వల్ల హీరో అయ్యాడు. ఒకవేళ పుట్టకపోయుంటే ఏదో ఒకటి కనిపెట్టి వరల్డ్ హీరో అయ్యుండేవాడు. ఏ విషయాన్నైనా ఒక్కసారి చెబితే చాలు పట్టేస్తాడు. ఒకసారి చెబితే చాలు డైలాగ్స్ ను ఇట్టే పట్టేస్తాడు. ఏ ఎమోషన్ అయినా క్యారీ చేయగలడు. ఈ సినిమాలో తారక్ తప్ప మరే హీరోను ఉహించలేం.

మీరు, తారక్ ఎమోషనల్ జర్నీ ఎలా క్యారీ చేశారు?

-తారక్ ఈ కథకు బాగా కనెక్ట్ అయ్యాడు. ఓ ఎమోషనల్ సీన్ తను బరస్ట్ అయిపోయాడు. నేను, కెమెరామెన్ అందరూ ఏడుస్తున్నాం. మా చుట్టూ ఉన్న ఫారిన్ క్రూ కూడా ఏడుస్తున్నారు. ఇలా అందరూ ఎమోషనల్ అందరూ కనెక్ట్ అయిపోయారు. ఎమోషనల్ సైడ్ నుండి లాజికల్ సైడ్ కు అందరినీ నడిపించడం చాలా కష్టమైంది.  

డైరెక్టర్ గా మిగతా సినిమాలతో పోల్చితే ఎలాంటి శాటిస్పాక్షన్ పొందారు?

-మనం బ్రతికేది మహా అయితే 50-60 ఏళ్లు ఉంటుంది. ఈ టైంలో కూడా నేను ఈ స్టేజ్ లో ఒక క్రూతోనే ఎక్కువగా కనెక్ట్ అయిపోతుంటాను. అలాగే తారక్ అనేవాడు ఒక డ్రగ్ లాంటివాడు. తను ఓ రోజు సెట్ లోకి రాకపోతే పిచ్చెక్కినట్టవుతుంది. తారక్ ప్రేమ తుఫాన్ లా ఉంటుంది. దాంట్లో మనం మునుగుతూనే ఉంటాం. తనతో ఈ జర్నీని, ఎమోషన్ ను లైఫ్ లాంగ్ మరచిపోలేను. మా  మధ్య మంచి రిలేషన్ ఏర్పడింది. దాన్నుండి నేను బయటకు రావాలనుకోవడం లేదు.

నెక్ట్స్ ప్రాజెక్ట్..

-మూడు నెలలు వరకు గ్యాప్ తీసుకుని దేవిశ్రీ హీరోగా చేయబోయే సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాను. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs