వేరే హీరో గనక ఓ నిర్మాత పైన కేసు వేస్తే ఇంతలా గగ్గోలు పెట్టేవారు కాదు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ అవడమే హైలైట్. రేపు నాన్నకు ప్రేమతో రిలీజ్ అనగా ఈరోజు నిర్మాత భోగవల్లి ప్రసాద్ గారి ఆర్ధిక లావాదేవీల విషయంలో అదీ అత్తారింటికి దారేది విషయమై రచ్చ జరగడం ఇంకా పెద్ద హైలైట్. సినిమా యాపారాన్ని బాగా ఆకళింపు చేసుకున్న కొందరైతే పవన్ చేసింది సరైన పనే అని సమర్తిస్తుంటే ఇంకొందరైతే అయ్యో పాపం ప్రసాద్ గారని సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. నిజానికి పవన్ తలుచుకుంటే ఇప్పుడు నాన్నకు ప్రేమతో రిలీజ్ ఆపెయ్యొచ్చు లేదా తనకు రావాల్సిన రెండో, మూడో కోట్లు వీజీగా రాబట్టుకోవచ్చు. ఓ నిర్మాత నుండి రావాల్సిన పాత బాకీని గుంజడానికి ఇంతకన్నా రైట్ టైం ఏదీ ఉండదు. పవన్ మేనేజర్లు సరైన రుజువులు ప్రవేశపెట్టి తెదేపా సపోర్ట్ తీసుకుంటే సినిమా విలవిలలాడడం ఖాయం. ఎందుకంటే అటు పవర్లో ఉన్న తెదేపా, బాలకృష్ణలు ఎన్టీయార్ సినిమా బాలయ్య సినిమాకు ఎదురుగా రావడం సుతారము ఇష్టంలేక ఎటువంటి పాచికైనా వేయడానికి సిద్ధమంటూ వార్తలు వింటూనే ఉన్నాం. ఇష్యూ అంత సీరియస్ కాకపోవడమే పవన్ మంచితనానికి తార్కాణం అని పవర్ స్టార్ అభిమానులు ఇక్కడ కూడా తమ హీరో గొప్పతనాన్ని చాటుతున్నారు.