తమిళ 'తని ఒరువన్' రీమేక్ కోసం రామ్‌చరణ్ కుస్తీలు పడుతున్నాడు. 'బ్రూస్‌లీ' చిత్రం డిజాస్టర్‌గా నిలవడంతో ఈ చిత్రంపై ప్రత్యేక శ్రద్ద పెడుతున్నాడు చరణ్. కాగా ఈ చిత్రంలో హీరోయిన్‌గా శృతిహాసన్ పేరు దాదాపు ఖాయం చేసేశారు. అయితే ఈలోగా ఓ కొత్త హీరోయిన్ పోటీలోకి దిగి శృతికి షాక్ ఇవ్వడానికి రెడీ అవుతోంది. ఆమే ఎవరో కాదు... కీర్తిసురేష్. ఈమధ్య విడుదలైన 'నేను..శైలజ'లో హీరోయిన్‌గా నటించింది. క్యూట్‌గా ఉండటమే కాదు... ఫ్రెష్‌ఫేస్ కావడం కూడా కీర్తికి కలిసొచ్చే అంశం. చరణ్ పక్కన ఈ శైలజా అయితే బాగుంటుందని.. చిత్ర బృందం భావిస్తోంది. అందుకే ముందస్తుగా కీర్తిపై కర్చీఫ్ వేసేశారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా స్టార్ హీరోయిన్‌నే తీసుకోవాలని భావిస్తే తప్ప కీర్తి ప్లేస్‌కు ఢోకా లేనట్లే అనేది తాజా ఫిల్మ్‌నగర్ సమాచారం.