తెలుగులో హిట్టైన సినిమాలను డబ్బింగ్ చేసి హిందీ చానెల్స్‌లో ప్రసారం చేయడం సహజం. అక్కడ తెలుగు చిత్రాలకు మంచి మార్కెట్ ఉంది. టీఆర్పీలు కూడా బాగా వస్తుండటంతో సౌత్‌లో రిలీజ్ అవుతున్న చిత్రాలపై ముందుగానే కర్చీఫ్‌లు వేస్తున్నాయి బాలీవుడ్ వర్గాలు. తాజాగా సంక్రాంతికి విడుదల అవుతున్న సినిమాపై వీరి దృష్టి పడింది. జనవరి 15న సంక్రాంతి కానుకగా రానున్న నాగార్జున 'సోగ్గాడే చిన్నినాయన'పై హిందీ చానెల్స్ కన్ను పడింది. బాలీవుడ్‌లో నాగ్‌కు కూడా మంచి క్రేజే ఉంది. దాంతో ఈ చిత్రం డబ్బింగ్ శాటిలైట్ రైట్స్‌ను సుమారు కోటిరూపాయలు చెల్లించి నిర్మల కుమారి అనే థర్డ్ పార్టీ పేరుతో నిర్మాతలు ఈ చిత్రం డబ్బింగ్‌రైట్స్‌ను సొంతం చేసుకున్నారు.దీంతో ఈ చిత్రనిర్మాత కూడా అయిన నాగార్జునకు మరో కోటి రూపాయలు అదనంగా లాభం వచ్చిందన్న మాట...!