మూడు తిమింగలాల మద్య చిన్న చేప చిక్కుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో? ఇప్పుడు శర్వానంద్ నటిస్తున్న 'ఎక్స్‌ప్రెస్‌రాజా' పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈ చిత్రం పక్కా ప్లానింగ్‌తో ఎన్టీఆర్, బాలయ్య, నాగార్జున సినిమాలను ఢీకొట్టేంందుకు సై అంటోంది. లోప్రొఫైల్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా వస్తుండటం ఈ చిత్రానికి పెద్ద ప్లస్ పాయింట్‌గా చెప్పుకోవాలి. విభిన్న చిత్రాలు చేస్తాడనే పేరున్న టాలెంటెడ్ హీరో శర్వానంద్ 'రన్ రాజా రన్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' వంటి హిట్ చిత్రాల తర్వాత కమర్షియల్ హీరోగా కూడా ఎదిగాడు. మరోపక్క తన మొదటి చిత్రం 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్'తో సూపర్‌హిట్టు కొట్టిన మేర్లపాక గాంధీ చాలాగ్యాప్ తీసుకొని ఈ చిత్రాన్ని తీస్తుండటం, అభిరుచిగల చిత్రాలను నిర్మిస్తుందనే పేరును అతి కొద్ది కాలంలోనే సంపాదించుకున్న యువి క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించడం వంటి ఎన్నో ప్లస్ పాయింట్స్ ఈ చిత్రానికి ఉన్నాయి. ఇక సంక్రాంతి బరిలో నిలుస్తున్న ఏకైక లోబడ్జెట్ చిత్రం కూడా 'ఎక్స్‌ప్రెస్‌రాజా'నే. దీంతో టాప్‌స్టార్స్ చిత్రాలకు ఉండే భారీ ఒపెనింగ్స్‌లో ఆయా చిత్రాల కోసం వెళ్లే ప్రేక్షకులు ఆయా సినిమాలకు టిక్కెట్లు దొరక్కపోతే బెస్ట్ చాయిస్‌గా అడ్వాంటేజ్ తీసుకునే చిత్రం కూడా ఇదే కావడం గమనార్హం. మరి ఈ సంక్రాంతి సెలవుల సీజన్‌ను ఈ చిత్రం ఎంత వరకు క్యాష్ చేసుకుంటుందో వేచిచూడాల్సివుంది...!