'సైజ్‌జీరో' చిత్రం కోసం వెయిట్ విపరీతంగా పెంచిన స్వీటీ అనుష్క గత రెండు మూడు నెలలుగా తన బరువును తగ్గే పనిలో బిజీగా ఉంది. యోగాలు, డైటింగ్‌లు, ఎక్సర్‌సైజ్‌లతో ఆమె మరలా మునుపటి గ్లామర్‌ను తిరిగి పొందింది. దీంతో ఆమె ప్రస్తుతం బ్యాక్ టు షూటింగ్స్ అంటోంది. తాజాగా ఆమె సూర్య హీరోగా హరి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఎస్3' లో సూర్యకు భార్యగా నటిస్తోంది. ఇప్పటికే సూర్యతోపాటు శృతిహాసన్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్న హరి అనుష్క సెట్‌లోకి రాగానే ముందు ఆమె వర్క్‌ను పూర్తి చేయాలని బావిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్‌లో అనుష్క ఈ నెల 12 నుండి పాల్గొంటుంది. ఇక వీలైనంత త్వరగా 'ఎస్3'లో తన పార్ట్ షూటింగ్‌ను పూర్తి చేసి ఫిబ్రవరి నుండి 'బాహుబలి2'కు కాల్షీట్స్ కేటాయించింది. దీంతో 'ఎస్3' పూర్తయిన తర్వాత ఈ జేజమ్మ 'బాహుబలి2'లో దేవసేనగా తనదైన శైలిలో నటించడానికి సంసిద్దురాలు కాబోతోంది. మొత్తానికి మరలా షూటింగ్‌ల్లో తమ స్వీటీ బిజీ కానుండటం ఆమె అభిమానులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని చెప్పాలి.