Advertisement
Google Ads BL

'డిక్టేటర్‌'పై ఈరోస్‌ నమ్మకం..!


నందమూరి బాలకృష్ణ హీరోగా శ్రీవాస్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'డిక్టేటర్‌' చిత్రం ఈనెల 14న సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని కోలీవుడ్‌, బాలీవుడ్‌లలో విడుదల చేయాలని ముందు భావించినప్పటికీ తమిళ్‌లో డబ్‌ చేసే కంటే అక్కడి స్టార్‌ హీరోతో రీమేక్‌ చేస్తేనే తమకు ఆర్థికంగా ప్లస్‌ పాయింట్‌ అవుతుందని ఈరోస్‌ సంస్థ భావిస్తోందిట. ఈ చిత్రాన్ని కోలీవుడ్‌ స్టార్‌తో రీమేక్‌ చేయాలన్నది ఈరోస్‌ అభిప్రాయం. కాగా ఈ చిత్రాన్ని కోలీవుడ్‌ స్టార్‌ అజిత్‌ చేసేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. అతనికి స్టోరీ వినిపించిన వెంటనే అజిత్‌ ఈ సినిమాకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాడని కోలీవుడ్‌ మీడియా అంటోంది. అయితే సంక్రాంతి వరకు అంటే తెలుగులో 'డిక్టేటర్‌' విడుదల వరకు వెయిట్‌ చేసి ఆ తర్వాత తన నిర్ణయం చెబుతానని అజిత్‌ ఈరోస్‌ సంస్థకు మాటిచ్చాడట. ఇదే రకంగా బాలీవుడ్‌లో సైతం అజయ్‌దేవగణ్‌ ఈ చిత్రం రీమేక్‌లో నటించేదుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాడని సమాచారం. మొత్తానికి ఇది నిజమే అని మీడియా చెబుతున్నప్పటికీ 'డిక్టేటర్‌'పై అంచనాలు పెంచడానికే ఈ తరహా వార్తలను ఈరోస్‌ సంస్థ వ్యాపించజేస్తోందని, ఇది ఓ రకమైన పబ్లిసిటీ స్టంట్‌గా కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs