సినిమాలకు, రాజకీయాలకు మన ఇండియాలో అవినాభావ సంబంధం ఉంది. ముఖ్యంగా సినిమాల ద్వారా పేరు పొందిన ఎందఱో సూపర్ స్టార్స్ అటుపై వెండి తెర దేవుళ్ళుగా మారి రాజకీయాల్లోకి అడుగు పెట్టి ప్రజలకు ఎంతో సేవ చేసారు. ఎన్టీయార్, ఎమ్జీయార్ లాంటి మహానుభావుల తరువాత చిరంజీవి కూడా ఈ దిశగా అడుగులు వేసారు. ప్రస్తుతానికి తమిళనాడులో రజినీకాంత్ గారి మీద రాజకీయంగా ఆరంగేట్రం చేయాలన్న ప్రెజర్ ఉన్నప్పటికీ ఆయన ఎప్పుడూ దీనికి సానుకూలంగా లేరు. రజినీకాంత్ తరువాతి పొజిషన్లో ఉన్న తలా అజిత్ గారిని భారతీయ జనతా పార్టీలో చేరమని ఆహ్వానం అందినట్టు తెలుస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారే స్వయంగా ఈ రాయబారం పంపారని ఓ ఊహాగానం. నిజానికి రజినీనే భాజపాలో చేర్చుకునేందుకు సర్వప్రయత్నాలు చేసారు. కానీ సూపర్ స్టార్ ఎటూ తేల్చక పోయేసరికి కన్ను అజిత్ మీద పడింది. ముఖ్యమంత్రి జయలలిత కనుసన్నల్లో నడిచే తమిళ రాజకీయంలో కొత్త పుటను లిఖించడానికి అజిత్ సిద్ధవుతున్నారా లేక రజినీలాగే ఈయన కూడా తరువాత చూద్దాంలే అని తప్పుకుంటారా?