రామ్ నటించిన నేను శైలజను ఖచ్చితమైన హిట్టు కిందే లెక్కగట్టాలి. ఎన్నాళ్ళుగానో రామ్ పడుతున్న కష్టానికి ఇప్పుడు ఫలితం దక్కింది. కానీ ఈ ఫలితాన్ని పలుచన చేసేలా టీవీ 5 చానల్ వారు ఇచ్చిన నెగెటివ్ రివ్యూ మీద హీరో రామ్ కూడా అసంతృప్తి వెళ్లగక్కారు. ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని రామ్ గట్టిగానే వినిపించారు. మరి టీవీ 5 యాజమాన్యం అసలు ఆంతర్యం ఏమిటో తెలియదు గానీ ఈ రివ్యూను పబ్లిగ్గా తప్పు పట్టినట్టుగా మాట్లాడిన నవీన్ అనే టీవీ 5 ఉద్యోగిని వెంటనే ఉద్యోగం నుండి బహిష్కరించింది. ఈ విషయం వారి నోట వీరి నోట విన్న రామ్ వెంటనే స్పందించారు. ఇంకో ఉద్యోగం దొరికే వరకు నవీన్ ఎప్పటిలాగానే నెలనెలా వచ్చే జీతాన్ని తన ఆఫీసు నుండి పొందవచ్చని రామ్ మనస్ఫూర్తిగా సహాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. ఉద్యోగం అనేది జీతం కోసం చెయ్యొచ్చు కానీ కేవలం జీతం కోసమే ఉద్యోగం ఎప్పటికీ చేయను... ఖాళీగా కష్టంగా ఉన్నా నాకు ఇష్టమే అంటూ నవీన్ ఇచ్చిన సమాధానం హీరో రామ్ కొత్తగా ఫీలయి ఉంటాడు. ఇంత తతంగం జరిగినా టీవీ 5 వారు మాత్రం స్పందించలేదు.