Advertisement
Google Ads BL

'నాన్నకు ప్రేమతో' అంత హిట్ అవుతుందనే ఆశ!


ఎన్టీఆర్‌, సుకుమార్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం 'నాన్నకు ప్రేమతో'. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆడియోకు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. అలాగే ఈ చిత్రం టీజర్లు, ట్రైలర్స్‌కు వీక్షకులు బ్రహ్మాండంగా స్పందిస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 13న విడుదలకు సిద్దం అవుతోంది. మరోపక్క ఈ చిత్రం బిజినెస్‌ కూడా జరుగుతోంది. సీడెడ్‌, నార్త్‌ ఇండియా తప్ప అన్ని ఏరియాల బిజినెస్‌ పూర్తి అయినట్లు సమాచారం. ఈ రెండు ప్రాంతాల్లో ఈ సినిమాను సమర్పిస్తున్న రిలయన్స్‌ వారే రిలీజ్‌ చేయనున్నారని తెలుస్తోంది. కాగా ఈచిత్రంపై యూనిట్‌ చాలా నమ్మకాలు పెట్టుకొని ఉంది. ఈ చిత్రం తమకు భారీ హిట్‌ను అందిస్తుందనే నమ్మకంతో ఎన్టీఆర్‌, సుకుమార్‌లు ఉన్నారు. అలాగే 'దోచెయ్‌'తో బాగా నష్టపోయిన భోగవల్లి ప్రసాద్‌ తనకు ఈ చిత్రం 'అత్తారింటికి దారేది' చిత్రంలాగా లాభాల వర్షం కురిపిస్తుందనే ఆశతో ఉన్నాడు. మరి ఈ చిత్రం రిజల్ట్‌ ఎలా ఉంటుందో చూడాలంటే మరో ఏడెనిమిది రోజులు వెయిట్‌ చేయాలి!

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs