'భలే భలే మగాడివోయ్' సినిమాతో మంచి జోష్ మీద ఉన్న హీరో నాని.. 'అందాల రాక్షసి' ఫేం హను రాఘవపూడి డైరెక్షన్‌లో ఓ చిత్రం రూపొందుతోంది. నాని ఈ చిత్రంలో నందమూరి నటసింహం బాలకృష్ణకు అభిమానిగా నటిస్తున్నాడు. దీంతో ఈ చిత్రం కోసం 'జై బాలయ్య' అనే టైటిన్‌ను కూడా ఆలోచన చేస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. కాకపోతే ఈ టైటిల్‌ను పెడితే ఒక వర్గానికే చెందిన సినిమాగా ఉంటుందనే భయంతో 'కృష్ణాగాడి వీర ప్రేమగాధ' టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం ఆడియో విడుదలకానుంది. ఈ చిత్రం కోసం నాని 4కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని '14రీల్స్' పతాకంపై అనిల్‌సుంకర నిర్మిస్తున్నాడు. అనంతపురం బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథ ఇది. ఫిబ్రవరి 5న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ నెలలోనే ఫస్ట్‌లుక్‌తో పాటు ఆడియో కూడా రిలీజ్ కానుంది.