సాధారణంగా మాస్ అండ్ యాక్షన్ చిత్రాలకు ఓవర్‌సీస్‌లో మార్కెట్ తక్కువ. కానీ నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న 'డిక్టేటర్' చిత్రానికి మాత్రం ఓవర్‌సీస్‌లో భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ చిత్రాన్ని జనవరి 14న విడుదలకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను కొనేందుకు అన్ని ఏరియాల డిస్ట్రిబ్యూటర్లు బాగా ఆసక్తిని చూపిస్తున్నారు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే... ఓవర్‌సీస్ మార్కెట్‌లో ఈ చిత్రానికి భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ చిత్రం ఓవర్‌సీస్ రైట్స్ దక్కించుకునేందుకు పలువురు డిస్ట్రిబ్యూటర్లు 4కోట్లు చెల్లించేందుకు రెడీగా ఉన్నట్లు సమాచారం. అయితే పెద్ద డిస్ట్రిబ్యూటర్లు పోటీపడుతుండటంతో ఇంకా డీల్ ఫైనల్ కాలేదు. ఇప్పటికే ఈ చిత్రం నైజాం రైట్స్‌ను దిల్‌రాజు దక్కించుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు సీడెడ్ రైట్స్‌ను సాయి కొర్రపాటి కొనుగోలు చేశాడు. ఇప్పుడు మరో విశేషం ఏమిటంటే... ఇప్పుడు బాలయ్య కూడా మళయాల మార్కెట్‌లోకి ప్రవేశిస్తున్నాడు. 'డిక్టేటర్'కు సంబంధించిన మలయాళ వెర్షన్‌కు సంబంధించిన డబ్బింగ్ పనులు కూడా చాలా స్పీడుగా పూర్తిచేస్తున్నారు. సో.. ఇప్పుడు అల్లుఅర్జున్‌కు పోటీగా బాలయ్య సైతం మలయాళంలో మార్కెట్ కోసం తపనపడుతున్నాడన్నమాట...!