Advertisement
Google Ads BL

తప్పంతా సుక్కుదేనంట!


డైరెక్టర్ ఈజ్ కెప్టెన్ ఆఫ్ ది షిప్. ఓ సినిమాకు సంబంధించి తప్పు జరిగినా ఒప్పు జరిగినా దర్శకుడిదే ముఖ్య భాద్యత. మరి అలాంటి దర్శకుడే నిర్మాతను కష్టాల పాలు చేస్తుంటే ఏమనగలం. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న నాన్నకు ప్రేమతో చిత్రం ఒప్పుకున్న నాటి నుండీ నిర్మాత భోగవల్లి ప్రసాద్ గారు  అన్ని రకాలుగా కష్టాలకు, నష్టాలకు లోనవుతున్నారంట. మితి మీరిన బడ్జెట్ నుండి విపరీతమైన షూటింగ్ రోజులు, నెలల తరబడి ఫారెన్ దేశాలలో వృధా అయిపోయిన సమయం... అన్నీపోను ఇప్పుడు సమయానికి తయారవని ఫైనల్ ప్రోడక్ట్. ఓ వైపు సంక్రాంతికి గట్టీపోటీ ఇవ్వడానికి మేం సిద్ధమని ముందే ప్రకటించుకుని వీలైనంతగా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా పూర్తి చేసుకున్నారు. మరో వైపు పొంగల్ పోటీ అధికమవడంతో అనుకున్న డేట్ వరకు వస్తారా లేరా అన్న సందిగ్ధం అభిమానుల్లోనే కాక అడ్వాన్సులు ఇచ్చేసిన బయ్యర్లలోను నెలకొంది. వీరందరికీ సమాధానాలు ఇవ్వలేక, సినిమాను సెన్సారుకు పంపించే వరకు టీం మొత్తాన్ని ముందుకు నడపలేక, అటు పబ్లిసిటీ కూడా తానే చూసుకోవాల్సి రావడానికి తోడు ఫైనాన్షియాల్ క్లియరెన్సులు తీసుకురావడం లాంటి పనులతో ప్రసాద్ గారు, ఆయన కొడుకు బాపి తీవ్రమైన టెన్షనుకు లోనవుతున్నారట. తప్పంతా సుక్కుదేనని, సినిమాను కనీసం పది పదిహేను రోజుల ముందు పూర్తి చేస్తే ఈ ఆఖరి నిమిషంలో అవస్థ తప్పేదని సొంత యూనిట్ సభ్యులే కామెంట్ చేస్తున్నారట. ప్లానింగ్ గతి తప్పితే ఇలాగే ఉంటుంది మరి. ఈ సమస్య ఒక్క నాన్నకు ప్రేమతోదో, సుకుమార్ గారిదో కాదు... చానా పెద్ద సినిమాలు ఈ తరహాలోనే నవ్వులపాలవుతున్నాయి.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs