గతేడాది తని ఒరువన్ ఇచ్చిన విన్నింగ్ కిక్ ఈ ఏడాదికి అరవ హీరో జయం రవికి బాగా వర్క్ అవుట్ అయింది. ఎప్పుడు ఎక్స్పరిమెంట్లు చేయడానికి సిద్ధంగా ఉండే జయం రవి 2016ని కూడా తనదైన శైలిలో జాంబీతో మొదలు పెడుతున్నాడు. సాధారణంగా హాలివుడ్ ప్రేక్షకులు ఎక్కువగా ఆదరించే ఈ జోనర్ మొన్నే బాలివుడ్ వరకు వ్యాపించి ఓ లాస్ మేకింగ్ సినిమాతో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. కానీ తమిళ జనాల మీదున్న నమ్మకంతో మిరుదన్ అనే సినిమా ఈ జాంబీ జోనర్లో రూపుదిద్దుకుంది. ఐయాం లెజెండ్, కాంట్రాక్టేడ్ ఫేజ్ 1, 2 లాంటి హాలివుడ్ జాంబీలను పోలి ఉన్న మిరుదన్ నిజంగా ఒళ్ళు గగుర్పొడిచే సన్నివేశాల సమాహారంతో ట్రైలర్ ముందుకొచ్చింది. మనుషులలోకి విచిత్రమైన వైరస్ పాకి, మనుషులే మనుషులని కొరికి తినేసి లేదా ఆ వైరస్ ఇతరులకి ఎక్కించే ప్రక్రియ కథాంశంగా ఈ జోనర్ ఉంటుంది. బాడీలో విచిత్రంగా పాకే క్రిములు, నరాలు చిట్లు అందులోంచి బయటికి తన్నుకొచ్చే పురుగులు, వీరందరినీ కాపాడేందుకు బయల్దేరిన ఓ రక్షకుడు, వెల్లువలా వచ్చే ఎర్రటి నెత్తురు, పచ్చటి చీము... ఇలా విపరీతమైన వికృతితో ఉండే సినిమాలను మరి మన దక్షినాది ప్రేక్షకులు ఆదరిస్తారా? ధైర్యం ఉంటె సంక్రాంతి పండక్కి ఈ సినిమాని తమిళంలో కాస్కోండి!