విశాల్‌ పై వివాదం ముదురుతోంది!


విశాల్‌ హీరోగా తెరకెక్కిన తమిళ చిత్రం 'కథకళి'. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ చిత్రం సంక్రాంతికి విడుదలకు సిద్దమవుతోంది. తాజాగా ఈ చిత్రం వివాదంలో పడింది. సినిమాలోని ఓ సీన్‌లో విశాల్‌.. హీరోయిన్‌తో కండోమ్‌ తీసుకో.. అంటూ డైలాగ్‌ కొట్టడం ఇప్పుడు తమిళనాట వివాదానికి కారణం అయింది. ఆ డైలాగ్‌ మహిళలని కించపరిచే విధంగా ఉందంటూ ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. నడిగర్‌ సంఘం ఎన్నికల్లో తన భర్త శరత్‌కుమార్‌ను విశాల్‌ ఓడించడంతో నటి రాధిక కూడా ఇదే అదునుగా ఆందోళనకారులకు మద్దతుగా వ్యాఖ్యలు చేసింది. కండోమ్‌ అనేది సెక్స్‌ ఎడ్యుకేషన్‌కు సంబంధించిన అంశం. అందులో ఎవ్వరిని కించపరచడం అంటూ జరగలేదు. అది అశ్లీలం ఏమీ కాదు. ఏదైనా అభ్యంతరాలు ఉంటే సెన్సార్‌బోర్డ్‌ చూసుకుంటుందని విశాల్‌ అంటున్నాడు. కాగా ఈ చిత్రానికి పాండ్యరాజ్‌ దర్శకత్వం వహించగా, విశాల్‌ స్వయంగా విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ బేనర్‌లో నిర్మించాడు. ఇందులో కేథరిన్‌, రెజీనా హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

Show comments


LATEST TELUGU NEWS


LATEST IN NEWS

POPULAR NEWS



LATEST IN GALLERIES

POPULAR GALLERIES