తన తొలి సినిమా కథ విషయంలో చాలా తర్జనభర్జనలు పడ్డాడు అఖిల్. కథ కోసమే దాదాపుగా ఏడాది పాటు సమయం కేటాయించాడు. చివరకి రొటీన్ కథనే ఎంచుకొని నిరాశపరిచాడు. ఇప్పుడు రెండో సినిమా కథ కోసం మళ్లీ తన అన్వేషణ మొదలైంది. తొలి సినిమాలాగా మాస్ అండ్ యాక్షన్ కథను ఎంచుకోవాలా? లేదా లవ్ స్టోరీ చేయాలా? అనే విషయంలో అఖిల్ కన్‌ఫ్యూజన్ అవుతున్నాడు. దాంతోపాటు తాను ఎదురుచూస్తున్న కథలూ దొరకడం లేదు. అందుకే ఈ సారి రిస్క్ చేయకుండా బాలీవుడ్ రీమేక్‌నే నమ్ముకున్నాడని సమాచారం. 2013లో వచ్చిన బాలీవుడ్ సూపర్‌హిట్ మూవీ 'ఏ జవానీ హే దివానీ'ని రీమేక్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో అఖిల్ ఉన్నాడని టాక్. ఒకవేళ ఆ సినిమా రీమేక్ రైట్స్ దొరక్కపోతే... అదే పాయింట్‌ని తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్చుకొని తీద్దామనుకొంటున్నాడట. ఈ విషయంలో కొంత మంది దర్శకులతోనూ అఖిల్ సంప్రదింపులు జరుపుతున్నాడని తెలుస్తోంది. మొత్తానికి రెండో సినిమాగా అఖిల్ లవ్‌స్టోరీనే చేద్దామని ఫిక్స్ అయినట్లు సమాచారం. ఇంకేం... అఖిల్‌ను లవర్‌బోయ్‌గా చూసేయవచ్చన్నమాట...!