కుర్ర హీరో రామ్ నిజంగానే నేను శైలజ సినిమాతో హిట్టు కొట్టినా ఒకే ఒక్క టీవీ చానల్ మాత్రం ఇది రామ్ కెరీర్లోనే చెత్త సినిమా అని, దీనితో రామ్ ఫ్లాపుల పరంగా డబుల్ హ్యాట్రిక్ సాధించాడని కించ పరిచే రివ్యూ ఇచ్చింది. విశేషం ఏమిటంటే ఈ చానల్ రివ్యూ గురించి ఇప్పటి దాకా పెద్దగా పట్టించుకున్న నాథుడు లేడు. మరి రామ్ మాత్రం పనిగట్టుకుని ట్విట్టర్ ద్వారా ఈ చానల్ మీద సెటైర్లు వేయడంతో, తెలియని వారికి కూడా చెప్పి మరీ నెగెటివ్ రివ్యూను చూపించినట్టయింది.
ఇవ్వాళ నిర్మాతతో సమస్య ఉంటే తప్పుడు రివ్యూలు రాయడం, రేపు రాజకీయ నాయకులతో ప్రాబ్లెం ఉంటే తప్పు న్యూస్ ఇవ్వడం కరెక్ట్ కాదు. ఒక న్యూస్ ఛానెల్ నడపడం అనేది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. ప్రజలు న్యూస్ చానల్సును నమ్మేదే వారు ఎటువంటి పక్షపాతం లేకుండా సినిమా గురించి అయినా జనరల్ విషయం గురించైనా సమాచారం చెబుతారని. నాకు ఆ సదరు న్యూస్ ఛానెల్ పట్ల ఎంతో గౌరవం ఉంది. వాళ్ళ ప్రమాణాలు దిగజార్చుకోకుండా ఉంటూ ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవాలని కోరుకుంటున్నాను. ఈ ఒకే ఒక్క చానల్లో తప్ప మిగతా అన్ని చోట్లా నేను శైలజ బాగా రన్ అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉండి అంటూ పేర్కొన్నారు రామ్.