టాలీవుడ్‌లో జక్కన్నగా పేరుగాంచిన రాజమౌళి ఎలాగైతే చిత్రాలను చక్కగా చెక్కుతాడో.. అలాంటి మంచి పేరు ఉన్న బాలీవుడ్ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలి. కాగా ఈ దర్శకునికి 2005లో వచ్చిన 'బ్లాక్' తర్వాత మరలా హిట్ లేదు. వరుసగా ఫ్లాప్‌లను ఎదుర్కొన్న ఆయన 2013లో తీసిన 'రామ్‌లీలా' చిత్రం ఆయనకు మరలా మంచి హిట్‌ను సాదించింది. అంటే దాదాపు రెండేళ్ల కిందట వరకు ఆయన ఫ్లాప్ డైరెక్టర్. తాజాగా ఆయన తీసిన మరో క్లాసిక్ 'బాజీరావ్ మస్తానీ' చిత్రం షారుక్‌ఖాన్ నటించిన 'దిల్‌వాలే'ను తోసిరాజని అగ్రపీఠం పొందింది. ఈ చిత్రానికి రోజు రోజుకు కలెక్షన్లు పెరుగుతుండటమే దీనికి కారణం. స్లో అండ్ స్టడీగా ఈ చిత్రం కల్షెన్లు కొల్లగొడుతోంది. ఇప్పటికే ఈ చిత్రం ఇండియాలో 150కోట్లు, ఓవర్‌సీస్‌లో 70కోట్లకు పైగా వసూలు చేసింది. ఇలా పడిలేచిన కెరటంగా, గోడకి కొట్టిన బంతిలా దూసుకుపోతున్నాడు సంజయ్‌లీలాభన్సాలీ. మొత్తానికి ఆమధ్యకాలంలో ఆయన చేసిన 'గుజారిష్, సావరియా' వంటి ఫ్లాప్ సినిమాల దర్శకునిగా తనకు వచ్చిన చెడ్డపేరును ఆయన చెరిపేసుకొని మరలా హిట్ ట్రాక్‌లోకి వచ్చాడు.