నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న 99వ చిత్రం కావడం, అందునా ఈ చిత్రాన్ని ఈరోస్ సంస్థతో కలిసి దర్శకుడు శ్రీవాస్ స్వయంగా నిర్మిస్తుండటంతో ఇప్పుడు ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. 'లయన్' వంటి డిజాస్టర్ తర్వాత వస్తున్న చిత్రం అయినప్పటికీ ఈ చిత్రం బిజినెస్‌పై ఆ ప్రభావం పెద్దగా లేదని ట్రేడ్‌వర్గాలు అంటున్నాయి. కాగా ఈ చిత్రం బడ్జెట్ 25కోట్లు అని సమాచారం. ఈ చిత్రం శాటిలైట్ రైట్స్‌ను జెమినీ చానెల్ 6కోట్లపైగా భారీ మొత్తాన్ని ఇచ్చి సొంతం చేసుకుందిట. ఈ చిత్రాన్ని నైజాంలో దిల్‌రాజు పంపిణీ చేయడానికి సిద్దం అయి నిర్మాతలతో చర్చలు జరుపుతున్నాడు. ఇక ఆంధ్ర, సీడెడ్ ఏరియాల్లో కూడా ఈ చిత్రానికి థియేటికల్ రైట్స్ కోసం మంచి పోటీ ఏర్పడుతోంది. మొత్తంగా కలిపి ఈ చిత్రం విడుదలకు ముందే ఓ 10కోట్లు టేబుల్ ప్రాఫిట్ పొందడం ఖాయమని ట్రేడ్‌వర్గాల అంచనా. కాగా ఈ చిత్రానికి బాలీవుడ్ నుండి రీమేక్ రైట్స్ కోసం కొందరు నిర్మాతలు పోటీపడినప్పటికీ ఈరోస్ సంస్థ ఆ హక్కులను ఎవ్వరికీ ఇవ్వకుండా తన దగ్గరే ఉంచుకొందని తెలుస్తోంది. సో.. మొత్తానికి బాలయ్య 99వ చిత్రం 'డిక్టేటర్'పై అభిమానులతో పాటు సాదారణ ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఏర్పడి ఉన్నాయి.