హరర్, థ్రిల్లర్ చిత్రాలకు చిరునామాగా నిలిచింది హీరోయిన్ అంజలి. 'గీతాంజలి'తో ఆ తరహా కథల్లో ఆమెనే కథానాయికగా ఎంచుకుంటున్నారు. తాజాగా మరో దెయ్యం కథలో నటించడానికి అంజలి ఒప్పుకొందని టాక్. ఓంకార్ దర్శకత్వం వహించిన 'రాజుగారి గది' భారీ లాభాలతో అదరగొట్టింది. రెండున్నర కోట్లతో తీసిన ఈ సినిమా దాదాపుగా 7కోట్లు వసూలూ చేసింది. ఆ ధైర్యంతోనే 'రాజుగారి గది2' కి రంగం సిద్దం చేసుకుంటున్నాడు ఓంకార్. ఇందులో కొన్ని స్పెషల్ అట్రాక్షన్స్ జత చేస్తున్నారు. కథానాయికగా అంజలిని తీసుకుంటే మార్కెట్‌పరంగా క్రేజ్ ఉంటుందని, అలాగే తమిళంలో కూడా ఈ సినిమా వర్కౌట్ అవుతుందని భావించిన ఓంకార్ అంజలిని సంప్రదించాడు. ఓంకార్‌తో క్లోజ్‌గా ఉండే అంజలి.. వెంటనే ఈ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పేసిందని తెలుస్తోంది. సో.. 'రాజుగారి గది'లో అంజలి కూడా అడుగు పెట్టబోతోందన్న మాట...!