ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ తాను జనవరి 1 దాటిన తర్వాత ఇక ముంబై షిఫ్ట్ అయిపోతున్నానని, హైదరాబాద్‌లోని తన మిత్రులను మిస్ అవుతున్నట్లు ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. దాంతో ఇన్నాళ్లు ఇక్కడే సెటిలైన వర్మ హఠాత్తుగా ముంబై షిఫ్ట్ వెనుక కారణమేంటనేది హట్ టాపిక్‌గా మారింది. 'అప్పలరాజు' చిత్రం కోసం తెలుగుకు వచ్చిన ఆయన ఇక్కడే దాదాపు సెటిలైపోయాడు. హిందీ సినిమాలు తగ్గించుకుంటూ వచ్చాడు. 'ఐస్‌క్రీమ్' వంటి సిగ్రేడ్ సినిమాలు సైతం తీశాడు. అయితే అవేమీ ఇక్కడ వర్కౌట్ కాలేదు. తెలుగువారు ఆయన్ను గతంలో ఆదరించినట్లుగా అక్కున చేర్చుకోలేదు. ఆయన్ని మీడియానే కాదు అభిమానులు సైతం విమర్శించడం మొదలెట్టారు. దానికి తోడు ఆయన మెగాక్యాంప్‌ని కొంతకాలం, ఇక్కడ పాలిటిక్స్‌ని కొంతకాలం ట్వీట్స్‌లో సెటైర్స్ వేస్తూ ఉండటం చాలామందికి ఆయనపై ఇంట్రస్ట్ తగ్గిపోయేలా చేసింది. సినిమాలను పక్కనపెట్టి కేవలం ట్వీట్స్‌తో కాలం గడపటం సినిమా ప్రియులకు మింగుడు పడలేదు. ఈ నేపథ్యంలో ఆయన ముంబై షిఫ్ట్ అవుతున్నట్లు ప్రకటన చేశాడు. వర్మ ముంబై షిఫ్ట్ కావడం వెనుక.. అమితాబ్‌తో 'సర్కార్3' పట్టాలు ఎక్కించాలనే ఉద్దేశ్యం ఉన్నట్లు తెలుస్తోంది. రీసెంట్‌గా ఆయన అమితాబ్‌కు కథ వినిపించి ఓకే చేయించుకున్న ఆయన న్యూఇయర్‌లో ఈ చిత్రం ప్రకటన చేసి మళ్లీ బాలీవుడ్‌ని తనవైపు తిప్పుకోవాలనే ఫిక్స్ అయ్యాడట. అక్కడే వరస ప్రాజెక్ట్‌లు చేసి తెలుగు పరిశ్రమకు దూరంగా కొంతకాలం పాటు ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.