ఇప్పుడు నందమూరి అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయారా? అంటే.. ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఔననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. గత కొంతకాలంగా బాబాయ్ బాలకృష్ణతో దూరంగా వుంటున్నారు ఎన్టీఆర్. అయితే ఇప్పటి వరకు ఈ ఇద్దరూ సినిమాల పరంగా ప్రత్యక్షంగా ఎప్పుడూ పోటీపడలేదు. అయితే ఈ సంక్రాంతికి ఆ సమరం జరగబోతుంది. బాబాయ్, అబ్బాయ్‌లు పోటీపడి తమ చిత్రాలను సంక్రాంతికి విడుదల చేస్తున్నారు. అయితే నేడు(డిసెంబర్ 27) శిల్పాకళా వేదికలో జరగనున్న ఆడియో వేడుకలో నందమూరి అభిమానుల్లో.. కేవలం ఎన్టీఆర్ అభిమానులు మాత్రమే ఈ ఆడియో వేడుకలో పాల్గొనబోతున్నారు. అంతేకాదు ఈ ఆడియో ఫంక్షన్‌కు సంబంధించిన పాస్‌లు కూడా ఎన్టీఆరే తన అధీనంలో వుంచుకుని.. కేవలం తన ఫ్యాన్స్‌కు మాత్రమే పాస్‌లు పంపిణీ చేస్తున్నాడని ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆడియో వేడుకలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.