బాబాయ్-అబ్బాయ్‌ల మధ్య పోరు రసవత్తరంగా మారింది. బాబాయ్ ‘డిక్టేటర్’తో అబ్బాయ్ ‘నాన్నకు ప్రేమతో’ చిత్రంతో ఢీ కొట్టాడానికి సిద్ధమయ్యాడు. ‘నాన్నకు ప్రేమతో’ చిత్రాన్ని సంక్రాంతి విడుదల చేయాలని ఎన్టీఆర్ సర్వశక్తులు ఒడ్డుతున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో జనవరి 13న సినిమా విడుదల చేయాలని దర్శకుడు సుకుమార్‌కు హుకుం జారీచేశాడు ఎన్టీఆర్. అందుకే ఆఘమేఘాల మీద పోస్ట్‌ప్రొడక్షన్ పనులు, షూటింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంకా ఒక పాట, పతాక సన్నివేశాలు చిత్రీకరించాల్సి వుందని తెలిసింది. అయినా సంక్రాంతికి చిత్రాన్ని తీసుకురావడానికి నాన్నకు ప్రేమతో యూనిట్ రాత్రింబవళ్ళు శ్రమిస్తుంది. అయితే కేవలం బాబాయ్ మీద వున్న అసంతృప్తితో ఎన్టీఆర్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడట. కంటెంట్ పరంగా ఆలోచిస్తే.. ‘డిక్టేటర్’కు కోన వెంకట్ అనే పేరు ఎంత మైనసో.. బాలయ్య పవర్‌ఫుల్ ప్రెజెన్స్ వెయ్యి ఎనుగుల బలం..కాగా కంటెంట్ పరంగా నాన్నకు ప్రేమతో వెర్రీ స్ట్రాంగ్‌గా వుందని...విభిన్న చిత్రాల దర్శకుడు ఓ వినూత్నమైన కాన్సెప్ట్‌కు పూర్తి కమర్షియల్ ఎలిమెంట్స్ జతచేసి.. సుకుమార్ తొలిసారిగా తెరకెక్కించిన పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఇదని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. అందుకే ఎన్టీఆర్ సినిమాపై వున్న కాన్ఫిడెన్స్‌తో బాబాయ్‌తో సమరానికి దిగుతున్నాడు.