బాలీవుడ్‌లో అక్షయ్‌కుమార్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన 'స్పెషల్ 26' చిత్రాన్ని తెలుగులో రవితేజ రీమేక్ చేయలనుకున్నాడు. అన్ని అనుకున్నట్లు జరిగి ఉంటే హరీష్‌శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెలుగులో రీమేక్ కావాల్సివుంది. దీనికోసం రవితేజ కూడా బాగా ఆశపడ్డాడు. కానీ అతనికి అది దక్కకుండా దూరం అయింది. ఈ చిత్రం దక్షిణాదిలోని అన్ని భాషల్లో రీమేక్ చేసేందుకు తమిళ దర్శకనిర్మాత, నటుడు త్యాగరాజన్ హక్కులు పొందాడు. తన కొడుకు, తమిళ హీరో ప్రశాంత్ హీరోగా ఈ సినిమా చేసేందుకు ఆయన ప్లాన్ చేశాడు. తన కొడుకుని స్టార్‌హీరోగా నిలబెట్టడానికి త్యాగరాజన్ చాలాకాలంగా ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రశాంత్ మాత్రం అనుకున్నంత స్థాయికి ఎదగలేకపోతున్నాడు. ఇప్పుడు 'స్పెషల్26' చిత్రాన్ని దక్షిణాదిలోని అన్ని భాషల్లో రీమేక్ చేస్తాడట. ఈ చిత్రానికి తమిళంలో 'ఇరుబదుఆరు' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రానికి ఇంకా హీరోయిన్ ఖరారు కాలేదు. ఇందులో సత్యరాజ్, ప్రకాష్‌రాజ్, నాజర్‌లతో పాటు బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఐటంసాంగ్‌లో నటించబోతోంది. త్వరితగతిన ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసి ఏప్రిల్ నెలలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.