తెలుగులోనే అటూఇటూ కాకుండా ఆడిన ఓ కథను పట్టుకుని హిందీలో తీస్తానంటే జనాలు నమ్మేస్తారా పూరీ గారు? పూరీ దర్శకత్వంలో పోయిన వారం విడుదలయిన లోఫర్ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పూర్తిగా చతికిలబడింది. అయినా ఊపిరి ఉన్నంత కాలం పేషెంటును వెంటిలేటర్ మీద పెట్టయినా డాక్టర్లు బతికించినట్టు కనీసం రెండు వారాలు సినిమా హాళ్ళలో ఉన్నప్పుడయినా జనాన్ని రప్పించేందుకు దర్శకులు, నిర్మాతాలు ఇలాంటి పబ్లిసిటీ మాత్రలు వాడడం సహజమే. అందుకే పూరీ గారు మొన్న నర్సీపట్నంలో లోఫర్ జైత్రయాత్రను ఉద్దేశించి ఆడియెన్సుతో ముచ్చటిస్తూ లోఫర్ కథను హిందీలో తొందరలోనే చేస్తానని చెప్పుకొచ్చారు. పూరీ చేసిన పోకిరి లాంటి సూపర్ హిట్టు సినిమాలు నిజంగానే బాలివుడ్ దాకా వెళ్ళాయి. అప్పటి పూరీ సినిమాల్లోని తేజస్సు ఇప్పటి వాటిలో కనపడనప్పుడు ఇక్కడి తెలుగు వాళ్ళే మాకొద్దు బాబోయ్ అంటుంటే అక్కడే ఉత్తరాది ప్రేక్షకులు రమ్మని ఆహ్వానిస్తారా బాబూ? ఏదైనా తీసేదుంటే ఉచితంగా చేసుకుందాం రా అని ఆఫర్ ఇస్తే చెప్పలేం గానీ లేకుంటే లోఫర్ కథని హిందీలో ఎవరు పట్టించుకుంటారు సారూ!!!