Advertisement
Google Ads BL

రాజ్‌తరుణ్‌ను వాడుకొంటున్నారు..!


హీరోగా హ్యాట్రిక్‌ హిట్స్‌ కొట్టిన యువ హీరో రాజ్‌తరుణ్‌. ప్రస్తుతం ఆయన డైరీ ఫుల్‌గా ఉంది. తనదైన నటన, డైలాగ్‌డెలివరి, ఎనర్జీ లెవల్స్‌.. ఇలా ఆయన తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఆయనతో సినిమాలు చేయడానికి నిర్మాతలు, దర్శకుడు క్యూలో నిలబడుతున్నారు. ఇంత బిజీగా ఉండి కూడా ఆయన త్వరలో విడుదలకు సిద్దమవుతున్న నాగశౌర్య 'అబ్బాయితో అమ్మాయి' చిత్రానికి వాయిస్‌ ఓవర్‌ ఇచ్చినట్లు సమాచారం. కాగా రమేష్‌వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఇళయరాజా, శ్యాం.కె.నాయుడు వంటి మంచి మంచి టెక్నీషియన్స్‌ పనిచేస్తున్నారు. గత కొంతకాలంగా హిట్‌లేని నాగశౌర్య ఈ చిత్రంపై బోలెడు ఆశలు పెట్టుకొని ఈ సినిమా ఫలితం కోసం ఎదురుచూస్తున్నారు. మొత్తానికి ఈ చిత్రానికి రాజ్‌తరుణ్‌ క్రేజ్‌ కూడా యాడ్‌ అయిందని చెప్పవచ్చు. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs