అది పనికొచ్చే సబ్జెక్టా, పనికిరాని సబ్జెక్టా అనికాదు హిట్టు కొడుతుందా లేదా అన్నదే ముఖ్యం. కథల్లో నవ్యత లోపించి తెలుగు సినిమా స్థాయి రోజురోజుకీ క్షీణిస్తోంది అని కొంతమంది విశ్లేషకులు నెత్తి నోరు బాదుకుంటున్నా జనాలు ఆదరించిందే అసలైన కథ అన్నట్టుగా సాగుతోంది టాలివుడ్ పోకడ. అందుకే గోపీచంద్ నుండి రానున్న సౌఖ్యం మొదటి లుక్కులోనే ఇది రెగ్యులర్ కోన గారి టెంప్లేట్ అని క్రిటిక్స్ కొట్టిపారేసినా, వీళ్ళ రాతలు మాకేం పట్టవన్నట్లుగా సేఫ్ ప్రీ రిలీజ్ బిజినెస్ పూర్తి చేసి ఇదిగో రేపు థియేటర్లలోకి వదులుతున్నారు. కూల్ అండ్ లైట్ సబ్జెక్ట్స్ జనాలు యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టే మేమీ సినిమా తీసాం అని హీరో గోపీచంద్ కూడా అంటున్నారు. నిజానికి కొద్ది ఏళ్ళ క్రితం వరకు గోపీచంద్ కూడా పరిశోధనా మార్గంలోనే ప్రాజెక్ట్స్ చేసాడు. వాటి ఫలితాలు తేడా కొట్టేసరికి ఇదిగో లౌక్యం, సౌఖ్యం అంటూ రూటు మార్చి ఇదే తనకు అనువైన దారని నమ్మేసాడు, ఇప్పుడు మనని కూడా నమ్మిస్తున్నాడు. అందుకే సౌఖ్యం ఖచ్చితమైన హిట్టని ఫిక్స్ అయిపోయాడు.