Advertisement
Google Ads BL

వరుణ్ తేజ్ లో ఇంతుందా..!


మాస్‌హీరోగానూ తాను మెప్పించగలనని 'లోఫర్‌'తో నిరూపించుకున్నాడు సుప్రీం హీరో వరుణ్‌తేజ్‌. ఈ సినిమా వల్ల ఎవరికైనా ప్రయోజనం చేకూరింది అంటే... అది వరుణ్‌తేజ్‌కే అని చెప్పవచ్చు. డైలాగులు చెప్పడంలో... ఫైట్స్‌ చేయడంలో వరుణ్‌ ఈజ్‌ చూస్తే ఫ్యాన్స్‌కి ముచ్చటేసింది. అన్నింటికంటే ముఖ్యంగా రొమాంటిక్‌ సీన్లలో ఆయన ఇరగదీశాడు. దిశాపటాని-వరుణ్‌తేజ్‌ల మధ్య ఓ రొమాంటిక్‌ గీతాన్ని పూరీ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇందులో వరుణ్‌ బాగా ఇమిడిపోయి జీవించేశాడు. ఓ షాట్‌లో దిశాపటాన్ని పెదవులను సున్నితంగా తన పెదవులతో అందుకొన్నాడు. అల్లుఅర్జున్‌, రామ్‌చరణ్‌లు మాస్‌హీరోలుగా పేరు తెచ్చుకున్నప్పటికీ రొమాంటిక్‌ సీన్ల విషయానికి వచ్చేసరికి కాస్త ఇబ్బంది పడుతుంటారు. కానీ వరుణ్‌తేజ్‌ మాత్రం.. అదేదో బాగా అలవాటు అన్నట్లుగా అల్లుకుపోయాడు. ఈ విషయంలో వరుణ్‌తేజ్‌కి మంచి మార్కులు పడిపోయాయి. మున్ముందు మనోడు ఇంకెన్ని యాంగిల్స్‌ చూపిస్తాడో వేచిచూడాల్సివుంది...!

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs