Advertisement
Google Ads BL

నిజంగా ఇది నిజమా! అల్లు అరవింద్‌ గారూ!


మెగా నిర్మాత అల్లుఅరవింద్‌ గురించి ఫిల్మ్‌నగర్‌లో రూమర్‌ ప్రచారంలోకి వచ్చింది. అల్లు అరవింద్‌ దెబ్బకి ఓంకార్‌ తమ్ముడు అశ్విన్‌ బలయ్యేవాడే కానీ.. తృటిలో తప్పించుకున్నాడనేది ఈ వార్తల సారాంశం. తన తమ్ముడు అశ్విన్‌ హీరోగా ఓంకార్‌ రూపొందించిన 'రాజు గారి గది' చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి ఫలితాలను సాధించింది. అశ్విన్‌ హీరోగా ప్రస్తుతం 'జతకలిసే' చిత్రం తెరకెక్కింది. చిన్న బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి రాకేష్‌ దర్శకత్వం వహించాడు. ఈనెల 25న ఈ సినిమా విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ సినిమా హక్కులను అవుట్‌రేట్‌కి వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి తీసుకొని విడుదల చేస్తున్నాడు. వాస్తవానికి సాయి కొర్రపాటి కంటే ముందు అల్లుఅరవింద్‌ ఈ సినిమా చూశాడని, సినిమా బాగా నచ్చి మొత్తం రైట్స్‌ని తనకు ఇచ్చేయమని అడిగాడట అల్లుఅరవింద్‌. మొత్తం రైట్స్‌ తీసుకోవడం అంటే సినిమాపై పూర్తి హక్కులు పొందడమే. అంటే సినిమాను ఒకవేళ విడుదల చేయకపోయినా అడగటానికి అసలు నిర్మాత, దర్శకులకు వీలులేని పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో ఆ చిత్ర నిర్మాత, దర్శకులు అందుకు అంగీకరించలేదు. ఈ సినిమా మొత్తం హక్కులు అల్లుఅరవింద్‌ చేతికి వచ్చి ఉంటే ఆ సినిమా విడుదల చేయకుండా.. తన తనయుడు అల్లుశిరీష్‌తో మళ్లీ రీమేక్‌ చేసి, తెలుగుతో పాటు తమిళం, మలయాళంలో విడుదల చేయాలని అల్లుఅరవింద్‌ ప్లాన్‌ చేశాడని, కానీ ఆ అవకాశం అయనకు దక్కలేదని ఫిల్మ్‌నగర్‌ సమాచారం.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs