Advertisement
Google Ads BL

'రోబో 2' కోసం శంకర్ తగ్గాడు!


2010లో రజనీకాంత్‌, ఐశ్వర్యారాయ్‌ల కాంబినేషన్‌లో శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన 'రోబో' చిత్రం సంచలన విజయం సాదించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ చిత్రానికి సీక్వెల్‌ 'రోబో2.0' షూటింగ్‌ లాంచనంగా మొదలైంది. దాదాపు 300కోట్ల బడ్జెట్‌తో లైకా ఫిలింస్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో అమీజాక్సన్‌ హీరోయిన్‌గా నటిస్తుండటం విశేషం. ఈ చిత్రాన్ని 3డి ఫార్మాట్‌లో తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా నటించనున్నట్లు పలువురు స్టార్ల పేర్లు వినిపించాయి. షార్‌ఖ్‌ఖాన్‌, అర్నాల్డ్‌, విక్రమ్‌, కమల్‌హాసన్‌, హృతిక్‌రోషన్‌ వంటి వారు పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే చివరకు అర్నాల్డ్‌ చేత ఈ చిత్రంలో విలన్‌ పాత్రను పోషింపచేయాలని శంకర్‌ భావించినప్పటికీ ఆయన పెట్టిన కండీషన్లు విని చివరకు తనే తగ్గాడు. హాలీవుడ్ నుండి విలన్ పెట్టాలని చూసి చివరికి  ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌కుమార్‌ ని విలన్‌ గా సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ చిత్రంలో నటించేందుకు అక్షయ్‌కుమార్‌ కూడా ఇంట్రెస్ట్ చూపడంతో..అతన్నే విలన్ గా ఫైనల్ చేశారు. మొత్తానికి విలన్‌ పాత్రను అక్షయ్‌ పోషిస్తుండటంతో ఈ చిత్రానికి బాలీవుడ్‌లో కూడా బాగా క్రేజ్‌ రావడం ఖాయమని అర్థమవుతోంది.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs