'బాహుబలి' అభిమానులకు ఓ శుభవార్త. 'బాహుబలి పార్ట్2'కు తొలి అడుగుపడింది. 'బాహుబలి - ది కన్‌క్లూజన్' షూటింగ్ షూరు అయింది. రామోజీ ఫిలింసిటీలో పార్ట్2 షూటింగ్ మొదలుపెట్టారు. ఇందుకోసం ప్రత్యేకంగా వేసిన భారీ సెట్‌లో ప్రభాస్, రమ్యకృష్ణల మీద కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ విషయాన్ని రాజమౌళి ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. ఈ షెడ్యూల్ జనవరి 13వరకు జరుగనుంది. పండగ అయిపోయిన తర్వాత లాంగ్ షెడ్యూల్ ప్రారంభం అవుతుంది. దాదాపు 5నెలల తర్వాత సెకండ్ పార్ట్ మొదలుకావడంతో అందరూ ఆనందంగా ఉన్నారు. కాగా ప్రస్తుతం 'సింగం3' షూటింగ్‌లో బిజీగా ఉన్న అనుష్క త్వరలో బాహుబలి పార్ట్2లో దేవసేనగా అడుగిడబోతోంది. ఇక రెండో షెడ్యూల్‌లోనే భళ్లాల దేవ రానా ఈ షూటింగ్‌లో జాయిన్ అవుతాడు. కాగా ఈ సెకండ్ పార్ట్‌ను కేవలం 200రోజుల్లో పూర్తి చేయాలని రాజమౌళి కృతనిశ్చయంతో ఉన్నాడు. మరి ఈ సెకండ్ పార్ట్ మరెన్ని సంచలనాలకు వేదిక అవుతుందో వేచిచూడాల్సివుంది...!