రామ్ గోపాల్ వర్మ గారి సినిమాలంటే క్రూరత్వాన్ని మరింత క్రూరంగా చూపించే సన్నివేశాలు కోకొల్లలుగా ఉంటాయని మనకు తెలిసిందే. కానీ మనిషిలోని పైశాచికత్వాన్ని సినిమాలో అవసరం ఉన్న చోట ప్రయోగిస్తే కథకు నప్పి, కథనాన్ని కూడా రక్తి కట్టిస్తుంది. ఈ విషయం బహుశా వర్మగారికి తెలిసినంతగా ఆయన శిష్యుడు పూరీ జగన్నాథ్ గారికి తెలీదు అనుకుందామా? ఈరోజు విడుదలైన లోఫర్ సినిమాలో విలన్ బ్యాచి ముకేష్ రిషి అండ్ ఆయన కొడుకులని ప్రేక్షకులకి పరిచయం చేసి వారిలోని దుర్మార్గపు పాత్రాఛాయలను చూపించే క్రమంలో కొడుకులు ఇద్దరు కలిసి తమ తల్లిని (పవిత్ర లోకేష్) కత్తితో పొడిచి చంపే దృశ్యం జనాలను బాగా డిస్టర్బ్ చేసింది. కథా పరిధులు దాటి అనవసరమైనదిగా అనిపించే ఈ సీను అసలు పూరీ ఎందుకు రాసుకున్నాడా అని విశ్లేషకులు పొడిచి పొడిచి మరీ పూరీని అడుగుతున్నారు. అంతటి ముదనష్టపు కొడుకులుగా ఇంట్రడ్యూస్ చేసి కథనం సాగేకొద్ది మధ్యలోనే వారిలోని కామెడీ యాంగిల్ వెదకడం, కథకుడిగా పూరీ చేసిన ఎంత పెద్ద లోపమో ఆయనకి తెలియదు అనుకుందామా? మదర్ సెంటిమెంట్ సినిమా అని చెప్పి, ఓ అమ్మ పాత్రనే కిరాతకంగా చంపించడం నీకు తగునా పూరీ? అడిగే వాళ్ళు లేరనేగా ఈ ఆరాచకాలు? వర్మ సాన్నిహిత్యంలో తెలుగు సెంటిమెంట్స్ మరిచి ఇంత క్రూయలుగా మారావా స్వామీ?