రజనీకాంత్ నటించనున్న 'రోబో2'లో అమీజాక్సన్ హీరోయిన్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. అందుతున్న సమాచారం ప్రకారం ఆమె ఈ చిత్రంలో ఆడరోబోగా కనిపించనుందని తెలుస్తోంది. 'మదరాస్ పట్టిణం' చిత్రం ద్వారా తమిళ ప్రేక్షకులకు పరిచయమైన ఈ లండన్ భామ అమిజాక్సన్ ఆ తర్వాత తెలుగు, హిందీ జనాలకు కూడా సుపరిచితురాలైంది. ప్రస్తుతం ఆమె దాదాపు దక్షిణాది హీరోయిన్‌గా మారిపోయింది. ఓవైపు ఉదయనిధి స్టాలిన్ సరసన 'గెత్తు'లో, మరోవైపు ధనుష్‌తో కలిసి 'తంగమగన్', ఇంకోవైపు విజయ్‌తో 'తెరి' లో నటిస్తూ బిజీగా ఉంది. ఆమె మాట్లాడుతూ... నేనెంతగానో ఇష్టపడే సూపర్‌స్టార్ రజనీకాంత్ సరసన నటించబోతున్నాననే మాట వినగానే సంబరంలో మునిగిపోయాను. నిజంగానే నేను లక్కీగాళ్‌ని. అంతేకాకుండా శంకర్ దర్శకత్వంలో మళ్లీ నటిస్తుండటం నిజంగానే అదృష్టం. ఈ సినిమా షూటింగ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను...అంటోంది.