Advertisement
Google Ads BL

అల్లు అర్జున్‌లో ఇంత మార్పు దేనికోసం?


మెగాక్యాంప్‌లో మళ్ళీ ముసలం మొదలైందని అంటున్నారు సినీ వర్గాలు. గత కొంతకాలంగా చిరు- పవన్‌కు మధ్య భేదాభిప్రాయాలు కొనసాగుతున్న విషయం అందరికి తెలిసిందే. అయితే తాజాగా మెగా కుటుంబానికి- అల్లు కుటుంబానికి మధ్య కూడా ఇలాంటి అభిప్రాయ భేదాలు వచ్చాయని సమాచారమ్. సన్నాఫ్ సత్యమూర్తి ఆడియో వేడుకలో తెలుగు సినీ పరిశ్రమలో ఎన్టీఆర్, ఎఏన్నార్ తర్వాత   పవన్, బన్నీలే స్టయిలిష్ హీరోలని దాసరి చేసిన వ్యాఖ్యలతోనే అసలు కథ ప్రారంభమైంది. మెగాస్టార్‌కు, దాసరికి అప్పటికే కొన్ని విషయాల్లో అభిప్రాయ భేదాలు వుండటం.. ఆ వేడుకకు దాసరిని ఆహ్వానించడం, తనను అవమానించిన దాసరి వ్యాఖ్యలను అల్లు అర్జున్ కనీనం ఖండించకపోవడంతో చిరు-అల్లు కుటుంబంలో అలజడి మొదలైంది. ఆ తర్వాత జరిగిన రుద్రమదేవి ఆడియోలో బన్నీ ఈ తప్పును సరిచేసిన.. చిరు సంతృప్తిపడలేదట. ఆ తర్వాత తాజాగా బ్రూస్‌లీ విడుదల సమయంలో గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్ నటించిన ‘రుద్రమదేవి’కు తెరమీదికి తీసుకరావడం... ‘రుద్రమదేవి’ కోసం ‘బ్రూస్‌లీ’ని వాయిదా వేసుకోమనడం.. ఇలా పలు పరిణామాలు జరిగాయి. అయితే ఆ సమయంలోనే విడుదలైన ‘బ్రూస్‌లీ' బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూడటం... ‘రుద్రమదేవి’లో గోన గన్నారెడ్డిగా బన్నీ నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకోవడం.. చిరుకు కాస్త ఇబ్బందిని కలిగించాయట.. సో.. అందుకే ఇంకా మెగా మేనల్లుడుగానే వున్న తన గుర్తింపును.. మార్చుకోవాలని అల్లు అర్జున్ ఆ క్షణమే నిర్ణయించుకున్నాడట.  అందుకే అప్పటి నుంచి వ్యక్తిగత ఇమేజ్ కోసం.. అల్లు అర్జున్ ప్రయత్నిస్తున్నాడని తెలిసింది. అందులో భాగంగానే ఇటీవల జరిగిన కుమారి 21ఎఫ్ ఆడియోకు హాజరైన బన్నీ..తన అభిమానుల చేత ‘ఎ’ అనే అక్షరంతో ప్రింట్ చేయించిన  ప్రత్యేక టీషర్ట్స్ ఇచ్చి మరి సందడి చేయించాడు.  ఇంకా  ఇటీవల చరణ్, చిరు కంటే ముందే బన్నీ చెన్నయ్ వరద బాదితులకు 25లక్షలు ప్రకటించడం.. ఈ రోజు(DEC15) క్యాన్సర్ భాదితురాలు.. అల్లు కుటుంబ అభిమానురాలైన మస్తాన్‌బీ కలవడం.. ఆమెలో ధైర్యాన్ని నింపడం.. ఇలా.. అల్లు అర్జున్‌లో కదలికలో మార్పు తన సొంత ఐడెంటిటీ కోసమేనని అంటున్నారు ఫిల్మ్‌నగర్ వర్గాలు.. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs